నేడు మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాకు రాక

 


నేడు మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాకు రాక


విజయనగరం, ఏప్రిల్ 12 (ప్రజా అమరావతి):

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం జిల్లాకు వస్తున్నారు. విద్యా శాఖ మంత్రి గురువారం సాయంత్రం 8-00 గంటలకు నగరానికి చేరుకుంటారు. 

శుక్రవారం ఉదయం 10 గంటలకు నగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. 11-00 గంటలకు గుర్ల మండలం పల్లి గండ్రేడు లో గ్రామ సచివాలయం భవనాన్ని ప్రారంభిస్తారు. 


మధ్యాహ్నం 4-00 గంటలకు మెరకముడిదాం మండలం గుంటపల్లి లో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం,  వెల్ నెస్ కేంద్రం భవనాలను ప్రారంభిస్తారు.



Comments