రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
ఈ బి సి నేస్తమ్ పథకంద్వారా జీవనోపాధి అవకాశాలు మరియు జీవన ప్రమాణాలను పెంపొందించడం కోసం 45 సంవత్సరాల పై బడి మరియు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతిపాదిత కమ్యూనిటీలలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడాని గాను EBC నేస్తమ్ పథకం 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబందించి తూర్పు గోదావరి జిల్లాలో 19, 782 మంది లబ్ధిదారులకు రు.29.67 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుది.
జిల్లాలో స్థాయి కార్యాక్రమం బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో నిర్వహించడం జరుగుతుంది.
రాష్ట్ర స్థాయి కార్యక్రమం ప్రకాశం జిల్లా మార్కాపురం లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి హాజరై లబ్ధిదారుల ఖాతాలకు బటన్ నొక్కి ఆన్ లైన్ విధానంలో నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు.
addComments
Post a Comment