*మెరుగైన వైద్య సేవలు అందించాలి
*
*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*
*: నల్లమడ మండల కేంద్రంలో కుటుంబ వైద్యుడు విధానం కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్*
నల్లమడ (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 20 (ప్రజా అమరావతి):
కుటుంబ వైద్యుడు విధానం కార్యక్రమం కింద మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశించారు. గురువారం నల్లమడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ వద్దనున్న సబ్ సెంటర్లో కుటుంబ వైద్యుడు విధానం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబ వైద్యుడు విధానం కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. మారుమూల గ్రామాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు కూడా వైద్య సేవలు అందించాలన్నారు. కుటుంబ వైద్యుడుతో ఇంటి వద్దకే వైద్యం అందించాలని, డాక్టర్ లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఔట్‌పేషెంట్ సేవలు ఇవ్వాలన్నారు. బీపీ, షుగర్, ఇతర జీవన శైలి జబ్బులకు రోగులకు రెగ్యులర్ చెకప్ చేయాలన్నారు. రోగులకు మందులు అందించాలన్నారు. నాణ్యత కలిగిన వైద్య సేవలు అందించి కుటుంబ వైద్యుడు విధానాన్ని కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఈరోజు ఎంత ఓపి వచ్చింది, ఎంతమంది షుగర్ పేషెంట్లు, బిపి పేషెంట్లు ఉన్నారు, అనిమియా కేసులు ఏమైనా ఉన్నాయా, మందులు అందిస్తున్నారా లేదా అంటూ పలు వివరాలను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా.దీప్తి, సూపర్వైజర్ మంజులమ్మ, ఎంఎల్హెచ్పి శిరీష, వైద్య సిబ్బంది, రోగులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment