అందరి సహకారంతో జిల్లా సమగ్ర అభి వృద్ధికి కృషి చేస్తా ...

 

 నెల్లూరు (ప్రజా అమరావతి);


అందరి సహకారంతో జిల్లా సమగ్ర అభి వృద్ధికి  కృషి చేస్తా ... 



బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో .. జిల్లా కలెక్టర్ హరి నారాయణన్.


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  అభివృద్ధి, సంక్షేమ పథకాలను సకాలంలో అర్హులైన అన్నీ వర్గాల  ప్రజలకు అందించడంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు,  మీడియా అందరి సహకారంతో జిల్లా సమగ్ర అభి వృద్ధికి  కృషి చేస్తానని  జిల్లా కలెక్టర్ శ్రీ  యం. హరి నారాయణన్ పేర్కొన్నారు. 


బుధవారం ఉదయం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నూతన  కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నేపధ్యంలో  కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో  జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్  మీడియాతో మాట్లాడుతూ,   రాష్ట్ర పభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు  జిల్లా కలెక్టర్ గా బాధ్యలు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను అర్హులైన  అన్నీ వర్గాల ప్రజలకు  అందించడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతా పధకాల  నిర్దేశించిన  లక్ష్యాల  సాధనకు  కృషి చేస్తానన్నారు.  జిల్లాలో  ముఖ్యమైన రామాయపట్నం పోర్టు,  ఫిషింగ్ హార్బర్ తదితర ప్రాజెక్టు   పనులను    త్వరితగతిన పూర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.  జిల్లా సమగ్రాభివృద్ధికి  కార్యాచరణ అమలు చేసి రాష్ట్రంలో జిల్లాను ముందంజలో నిలిపేందుకు  తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని  కలెక్టర్ వివరించారు..


Comments