నారా లోకేష్ పై తప్పుడు కథనాలు సృష్టించడం తగదు…మంగళగిరి దళిత నాయకులు

 *నారా లోకేష్ పై తప్పుడు కథనాలు సృష్టించడం తగదు…మంగళగిరి దళిత నాయకులు


*


*లోకేష్ మాటలను మార్ఫింగ్ చేయడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై మీడియా ముఖంగా ధ్వజమెత్తిన మంగళగిరి దళిత నాయకులు*


మంగళగిరి, ఏప్రిల్ 17 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లోకేష్ మాటలను మార్ఫింగ్ చేయడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం పట్ల సోమవారం మంగళగిరి ఎం.ఎస్.ఎస్ భవన్ లో రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు దొప్పలపూడి జ్యోతిబసు, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పొలుమట్ల ప్రేమ్ కుమార్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు యర్రగుంట్ల భాగ్యారావు, గుంటూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, పట్టణ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోదమల సురేష్, గుంటూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ కార్యదర్శి బెజ్జం రామకృష్ణ రావు లు మీడియా ముఖంగా తీవ్రంగా ఖండించారు. నారా లోకేష్ అనని మాటలను అన్నట్లుగా సాక్షి మీడియా, వైసీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలతో కుట్రలు చేస్తోందని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు.

          

          ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కనికళ్ళ చిరంజీవి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దళితులను నమ్మించి నట్టేట ముంచడానికి వైసిపి ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించి తప్పుడు కథనాలు సృష్టించడం సిగ్గు చేటని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత దినపత్రిక సాక్షి అక్రమాల పుట్ట అని విమర్శించారు. అక్రమ పెట్టుబడులతో పుట్టిన సాక్షికి ఇతరులను విమర్శించే హక్కు లేదన్నారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సాక్షి మీడియా తప్పుడు కథనాలు సృష్టించడం తగదని అన్నారు. పాదయాత్రలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎస్సీలతో ముఖముఖీ కార్యక్రమంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి దళితులకు చేసింది ఏమీలేదని నారా లోకేష్ ఆన్న మాటలను వక్రీకరించి సాక్షి దినపత్రికలో ప్రసురించడం సిగ్గు చేటాన్నారు అన్నారు. వివేకాను టిడిపి అధినేత చంద్రబాబే హత్య చేయించారని ఎన్నికల సమయంలో ప్రచారం చేసి అధికారంలోకి జగన్ కు ఇప్పుడు వివేకా హత్యలో ఆయన పాత్ర ఏమిటో బయటపడిందన్నారు. అలాగే కొడికత్తి శ్రీను విషయంలో కూడా మీరు చేసిన విషపూరిత ప్రచారం అబద్దమని తెలిసిపోయింది. ఇంకెన్నాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకుతారని ప్రశ్నించారు.  దళితుల ఆరాధ్య దైవం అంబేడ్కర్ విదేశీ విద్య పథకాన్ని పేరు మార్చి జగనన్న విదేశీ విద్య పథకం అని పెట్టడం అంబేడ్కర్ ను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి దళితులపై దమన కాండ సాగుతుంది. డాక్టర్ సుధాకర్ హత్య మొదలుకొని నేడు డాక్టర్ అచ్చెన్న హత్యలు ప్రభుత్వ హత్యలే అని అన్నారు. దళితుడైన కొడికత్తి శ్రీనుకి ఇప్పటి వరకు బైయిల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు సానుభూతి కోసం సొంత బాబాయినే పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు జగన్‌ అని మండిపడ్డారు. దళితులు జగన్ ను దూరం పెడుతున్నారన్న అక్కసుతోనే ఇటువంటి చర్యలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధికి ముఖ్యంగా దళిత కాలనీలలో రోడ్డు, ఎల్‌ఈడీ లైట్లు, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశాడన్నారు. దళితుల అభివృద్ధి జరిగిందంటే, అది చంద్రబాబు ద్వారానే జరిగినట్లు పేర్కొన్నారు. వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ అసత్య ప్రచారాలను దళితులు నమ్మకండని తెలిపారు. దళితులు వైసిపి ప్రభుత్వంను నమ్మే పరిస్థితి లేదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దళితులు ఐక్యంగా తెదేపాను అధికారంలోకి తీసుకొని వస్తారని తెలిపారు.


ఈ మీడియా సమావేశంలో  పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు దిడ్ల సత్యానందం, దుగ్గిరాల మండలం టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు పినపాటి కరుణాకర్, మంగళగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కొడవలి ఆనంద్, నియోజకవర్గ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ఈపూరి పెద్దబ్బాయి, టిడిపి సీనియర్ నాయకులు కుక్కమళ్ళ స్వామి,కట్టెపోగు కిషోర్ తదితరులు ఉన్నారు.

Comments