న్యాయ సంబంధిత సమస్యలు కానీ ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలి



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 




జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి గురువారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం మరియు ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించి ఆ కారాగారాల్లో వసతులను పరిశీలించారు. 


అనంతరం న్యాయమూర్తి ఖైదీలతో  మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న న్యాయ సేవల గురించి వివరించారు. కారాగారంలో కానీ, కేసు విషయంలో కానీ, వారి కుటుంబ సభ్యుల న్యాయ సంబంధిత సమస్యలు కానీ ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాల


ని కోరారు. అందరూ పరివర్తన చెంది నిజాయితీ గల జీవన శైలిని అలవర్చుకోవాలని న్యాయమూర్తి అన్నారు.



Comments