*- గుడివాడలో టీడీపీ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన వెనిగండ్ల రాము*
*- ఒకే వేదికపై రావి, వెనిగండ్ల, పిన్నమనేని మీడియా సమావేశం*
*- నేతల మధ్య ఐక్యత కోసమే చంద్రబాబును వెనిగండ్ల కలిసినట్టుంది*
*- చంద్రబాబు పర్యటనలో ఐక్యత చూస్తారంటూ మీడియాకు స్పష్టం*
*- చెప్పినట్టుగానే జిల్లా నేతలతో కలిసి ఐక్యతగా ఉన్నట్టు చూపించిన వెనిగండ్ల*
*- కలిసికట్టుగా ఎమ్మెల్యే కొడాలి నానిని ఢీ కొడతామన్న సాంకేతాలు*
గుడివాడ, ఏప్రిల్ 8 (ప్రజా అమరావతి): ఇప్పటివరకు కలుపుకెళ్లడం కుదరక గ్రూపు తగాదాలతో సతమతమవుతూ వస్తున్న గుడివాడ తెలుగుదేశం పార్టీలో నేతలందరినీ ఆ పార్టీ సీనియర్ నాయకుడు వెనిగండ్ల రాము ఏకతాటిపైకి తీసుకొచ్చినట్టుగా కన్పిస్తోంది.
చంద్రబాబు పర్యటన వేళ ఒకే వేదికపై జిల్లా నేతలతో కలిసి రావి, వెనిగండ్ల, పిన్నమనేనిలు మీడియా సమావేశం నిర్వహించడం గుడివాడ రాజకీయాలకు శుభపరిణామమనే చెప్పాలి. 2014 తర్వాత రావి, పిన్నమనేని కలిసి ఒకే వేదికను పంచుకోవడం చూసింది లేదు. రోజు రోజుకు ఇరు వర్గాల మధ్య గ్యాప్ కూడా పెరుగుతూ వచ్చింది. దీన్ని చూసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా భవిష్యత్తులో రావి, పిన్నమనేనిలు ఇక కలవరనే నిర్ణయానికైతే వచ్చేసినట్టున్నారు.
గత ఏడాది రద్దయిన చంద్రబాబు పర్యటన సమయంలోనూ రావి, పిన్నమనేనిలు ఎడముఖం పెడముఖంతోనే వున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది చివర్లో గుడివాడ రాజకీయాల్లోకి ఎన్నారై, టీడీపీ సీనియర్ నేత వెనిగండ్ల రాము గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. కేవలం నాలుగైదు నెలల్లోనే సేవా కార్యక్రమాలతో గుడివాడ నియోజకవర్గ ప్రజలకు చాలా దగ్గరైపోయారు. చంద్రబాబు ఆదేశాలతో అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తూ నిత్యం వందల మంది పేదల ఆకలిని తీర్చుతున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ టీడీపీ పూర్వ వైభవానికి కృషి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 13న చంద్రబాబు గుడివాడ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలంతా గుడివాడలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. వెనిగండ్ల రాముకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోయినా అయన ఎంతో సంయమనంతో వ్యవహరించారని చెప్పొచ్చు. ఎంతో ధైర్యంగా పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. గుడివాడ పర్యటనపై వెనిగండ్ల రాము ఇచ్చిన క్లారిటీతో 13 వ తేదీ రాత్రికి బస చేసి, 14 న గుడివాడలోనే అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు చంద్రబాబు అంగీకరించారు. ఈ సందర్బంగా గుడివాడలో నేతలందరినీ కలుపుకొని వెళ్లేలా చంద్రబాబు నుండి జిల్లా టీడీపీ నేతలందరికి ఆదేశాలు వెళ్లాయి. వెనువెంటనే వెనిగండ్ల రాము కూడా టీడీపీలో పిలుపులకు నోచుకోని పిన్నమనేనిని కలవడం జరిగింది. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడుతో భేటీ, చంద్రబాబును కలిసి మాట్లాడిన అంశాలను పిన్నమనేనికి వివరించారు. మీడియా గుచ్చి గుచ్చి అడిగిన ప్రశ్నలకు వెనిగండ్ల రాము సమాధానం ఇస్తూ చంద్రబాబు గుడివాడ పర్యటనలో అందరం కలిసి ఐక్యంగా ఉంటామని స్పష్టం చేశారు. గుడివాడలో జరిగిన సమావేశానికి పిలవకపోవడంపై స్పందిస్తూ వ్యక్తిగత పనుల వల్ల పాల్గొనలేదని సర్దిచెప్పుకున్నారు. మరోవైపు అందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే కొడాలి నానిని ఢీ కొడతామన్న సాంకేతాలను కూడా వెనిగండ్ల రాము ఇచ్చేసారు. చివరికి వెనిగండ్ల రాము అనుకున్నట్టుగానే గుడివాడలో టీడీపీ నేతలంతా ఒక్కటయ్యారు. చంద్రబాబు గుడివాడ పర్యటన వేళ వెనిగండ్ల రాము చొరవ కారణంగా మొత్తానికి టీడీపీలో గ్రూప్ తగాదాలకు మాత్రం చెక్ పడినట్టుగా అర్ధమవుతోంది.
వెనిగండ్ల రాములా ఎప్పుడో ప్రయత్నించి ఉంటే గుడివాడ టిడిపిలో గ్రూపు తగాదాలు సమసిపోయి ఉండేవని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
addComments
Post a Comment