నెల్లూరు (ప్రజా అమరావతి);
జిల్లాలో మంజూరై చేపడుతున్న వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబందించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్, అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మనాథ్ తో కలిసి జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో వున్న భూసేకరణ ప్రక్రియపై నెల్లూరు, ఆత్మకూరు, కావలి రెవెన్యూ డివిజన్ అధికారులు, సంబందిత ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి డివిజన్ల వారీగా, ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మంజూరై చేపడుతున్న వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబందించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబందించి ప్రాజెక్టు వారీగా నిర్ధిష్టమైన గడువును నిర్దారించుకొని ఆ గడువులోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలన్నారు. జిల్లాకు మంజూరైన వివిధ ప్రాజెక్టులకు కావలసిన భూములకు సంబంధించి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడంలో, నష్టపరిహారం చెల్లించడంలో ఆలస్యం అవుతోoదని, రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎటువంటి జాప్యం చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ప్రక్రియను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ, సంబందిత ప్రాజెక్టుల అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఆయా ప్రాజెక్టులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ విద్యాధరి, ఇంచార్జీ జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్.డి.ఓ లు మలోల, శీనా నాయక్, కరుణకుమారి, ఎన్.హెచ్.ఏ.ఐ పిడి గోవర్ధన్, సంబంధిత ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు భూ సేకరణ విభాగం కలెక్టరేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment