రాష్ట్రం లోని గ్రామ గ్రామాన ప్రతి కుటుంబం లో సంక్షేమ జోరు కొనసాగుతుంది.

 

నెల్లూరు  ఏప్రిల్ 17 (ప్రజా అమరావతి);


రాష్ట్రం లోని గ్రామ గ్రామాన ప్రతి కుటుంబం లో సంక్షేమ జోరు కొనసాగుతుందని


రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.

    

సర్వేపల్లి నియోజక వర్గంలోని మనుబోలు మండలం ముద్దుముడి గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాణి కి గ్రామస్తులు బ్రహ్మరధం పట్టారు.


తోలుత ముద్దుముడి గ్రామం లో చేపట్టిన సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు వంటి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు . అదేవిధంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మంచినీటి ఆర్ ఓ ప్లాంటు ను ప్రారంభించారు.


అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, నేరుగా ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం గురించి విచారణ, సాంకేతిక కారణాలతో అందని వారికి అందించడమే లక్ష్యంగా ఏర్పాటైనదే గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమమన్నారు. లెక్క కు మించి ప్రతి వర్గానికి సమగ్రంగా, సంపూర్ణంగా, పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. గతంలో మాదిరి కేవలం శంఖుస్థాపనలకే పరిమితం కాకుండా, ఆయా అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభిస్తున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 72 సచివాలయాల పరిధిలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి చేసామన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలన్నారు.


ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మి నారాయణ, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, వాలంటీర్లు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.



Comments