రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరం నగరపాలక పరిధిలోని సుబ్బారావు నగర్ లో స్థల వివాదం కు సంబందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన మేరకు, విచారణ అధికారిగా నియమించిన సేర్ప్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఎమ్ డి ఇంతియాజ్ విచారణ నిమిత్తం గురువారం రాజమండ్రి రావడం జరిగింది. ఈ పర్యటన లో భాగంగా సుబ్బారావు నగర్ లో సంభందిత స్థలాన్ని పరిశీలించి ఇంతియాజ్ విచారణ చేపట్టడం జరిగింది.
అంతకు ముందు విజయవాడ నుంచి రాజమహేంద్రవరం లోని ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకున్న ఇంతియాజ్ వారిని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మర్యాద పూర్వకంగా కలిసి , విచారణ నిమిత్తం ఇంతియాజ్ వారిని అనుసరించడం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment