నెల్లూరు, ఏప్రిల్ 13 (ప్రజా అమరావతి): ప్రతి కుటుంబానికి మేలు చేకూరేలా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కింద
ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం సురాయపాలెంలో గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా పర్యటించిన మంత్రికి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న తర్వాత, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం, ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించడమే లక్ష్యంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని, సుమారు ఏడాది పాటు కొనసాగుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ప్రతి కుటుంబం కూడా ప్రభుత్వ పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తుందని చెప్పారు. రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధర లభించి, పంట ఉత్పత్తి శాతం కూడా పెరగడంతో అన్నదాతలు ఆనందంగా ఉన్నారన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని సేవలను సకాలంలో అందిస్తున్నామన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన సంగం బ్యారేజీని పూర్తి చేసి రైతాంగానికి పుష్కలంగా సాగునీరు అందించమన్నారు. రైతన్నలు రెండో పంటకు కూడా సిద్ధమవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా భవిష్యత్తులో మరింత ఎక్కువగా పనిచేస్తామని మంత్రి ఈ సందర్భంగా పునరుద్గాటించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment