సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతున్న వెనిగండ్ల.

 *- సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకమవుతున్న వెనిగండ్ల


*

 *- ప్రజా సేవలో మరింతగా ముందంజ వేయాలి*

 *- ఆలయ ప్రతిష్టకు వెనిగండ్ల రావడం సంతోషకరం* 

 *- ప్రశంసించిన రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జి కొర్నేలియస్*



గుడివాడ, ఏప్రిల్ 29 (ప్రజా అమరావతి): సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా వెనిగండ్ల రాము ప్రజలతో మమేకమవుతున్నారని కృష్ణా- గోదావరి అధ్యక్ష ఖండ పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ టి జార్జి కొర్నేలియస్ ప్రశంసించారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని గుడ్ మెన్ పేటలో సిఎస్ఐ గుడ్ మెన్ మిషనరీ చర్చి ఆలయ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నేత, వెనిగండ్ల ఫౌండేషన్ అధినేత వెనిగండ్ల రాము ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ముందుగా సంఘ పెద్దలు వెనిగండ్ల రాముకు ఘన స్వాగతం పలికారు. గుడ్ మెన్ పేటలోని ఏసుక్రీస్తు విగ్రహం దగ్గర నుండి తీన్మార్ డప్పుల నడుమ వెనిగండ్లపై పూల వర్షం కురిపిస్తూ భారీ ర్యాలీగా సిఎస్ఐ గుడ్ మెన్ మిషనరీ చర్చ్ ఆలయం దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైట్ రెవరెండ్ డాక్టర్ టి జార్జి కొర్నేలియస్ తో కలిసి వెనిగండ్ల ప్రేయర్ చేశారు. వెనిగండ్లకు డాక్టర్ జార్జి కొర్నేలియస్ దీవెనలను అందించారు. అనంతరం డాక్టర్ జార్జి కొర్నేలియస్ మాట్లాడుతూ వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు గొప్పగా సేవలు అందుతున్నాయని కొనియాడారు. ప్రజా సేవలో వెనిగండ్ల మరింతగా ముందంజ వేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా నిరుపేదలను ఆదుకోవడంలో వెనిగండ్ల ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం వెనిగండ్లను రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జి కొర్నేలియస్ సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా- గోదావరి అధ్యక్ష ఖండ స్త్రీల మైత్రి అధ్యక్షురాలు టి జాషువా కుమారి, పాస్టర్లు ఎస్ అలెగ్జాండర్, డిడి సుధాకర్ రావు, టీజే సుధీర్ దత్, బిజెడ్ రత్నకుమార్, బి కరుణానిధి, టీ మోహన్ రావు, జెజె ప్రకాష్, తాడికొండ జాషువా తదితరులు పాల్గొన్నారు.

Comments