నెల్లూరు జిల్లాలో 12,072 మంది అర్హులైన మత్స్యకార కుటుంబాలు వైయస్సార్ మత్స్య కార భరోసా పథకం క్రింద లబ్ది పొందారు


నెల్లూరు:మే.16 (ప్రజా అమరావతి);

శ్రీ పొట్టి రాములు నెల్లూరు జిల్లాలో 12,072 మంది అర్హులైన మత్స్యకార కుటుంబాలు వైయస్సార్ మత్స్య కార భరోసా పథకం క్రింద లబ్ది పొందార


ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ తెలిపారు . రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం 1లక్షా 23 వేల మంది కి 123 కోట్ల రూపాయలు బటన్ నొక్కి మత్స్యకారుల ఖాతాలో వేసారు.  నెల్లూరు కలెక్టర్ కార్యాలయ తిక్కన ప్రాంగణం నుండి zp చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ , జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ వర్చువల్ గా పాల్గోన్నారు. అనంతరం ఆనం అరుణమ్మ విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 12072 మంది మత్స్యకారులు 12 కోట్ల 7 లక్షల  లబ్ది పొందారనీ ఆమె అన్నారు. మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ బృతిని ఈ ప్రభుత్వం 2019 నుండి 4 వేల నుండి 10వేలకు పెంచిందని ఆమె పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం కుటుంబానికి 10 వేల ఆర్థిక సహాయం అందజేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.


జాలరుల కుటుంబాలకు తోడుగా ఉండేందుకు వైయస్సార్ మత్స్యకార భరోసా. కలెక్టర్


జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరి నారాయణన్ మాట్లాడుతూ సముద్రంలో వేసవిలో వేట నిషేధ సమయంలో జాలర్ల కుటుంబాలకు తోడుగా ఉండి జీవనం సాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ మత్స్యకార భరోసా కింద ప్రతి ఏటా పదివేల ఆర్థిక సహాయం అందిస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యాంత్రిక మరియు మరపడవల వేట నిషేధాన్నిఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు అమలు చేస్తున్నదని ,ఈ వేట నిషేధ కాలంలో జాలర్ల కుటుంబాలు ఇబ్బందులు  పడకుండా ప్రభుత్వం బృతి అందించి ఆదుకుంటున్నదని కలెక్టర్ అన్నారు. జాలర్లకు ఇచ్చే డీజిల్ సబ్సిడీని 6 రూపాయల నుండి 9 రూపాయలకు పెంచి స్మార్ట్ కార్డుల ద్వారా నేరుగా బంకుల నుండి సబ్సిడీతో ఆయిల్ పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. జిల్లాలో పోర్ట్ లేకపోవడం వల్ల జాలర్లు మేకనైజ్డ్ బోట్ స్థాయికి  ఎదగలేక  వెనుక బడుతున్నారని  ఆయన అన్నారు మనకు  కూడా పోర్టులు నిర్మాణ మవుతున్నందున  ఫిషింగ్ హార్బర్ లు ఏర్పాటు అవుతాయని  తద్వార మత్యకారులు ప్రయోజనం పొందుతారు అని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం లో నాలుగు ఫిష్ లాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారని ,మన జిల్లాలో జువ్వలదీన్నే లో ఫిష్ లాండింగ్ సెంటర్ పనులు త్వరలో పూర్తి  అవుతాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  దీనిని ప్రారంభిస్తారని అన్నారు.

జిల్లాలో కావలి నియోజకవర్గం లో 4 9 12 మంది లబ్ధిదారులు, కోవూరు నియోజకవర్గంలో3028 మంది, సర్వేపల్లి నియోజకవర్గంలో1800 మంది, కందుకూరు నియోజకవర్గంలో2332 మంది మత్స్యకార లబ్ధిదారులు ప్రయోజనం పొందారన్నారు.

ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు ఎం నాగేశ్వరరావు, ఏడీలు విజయ కృష్ణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Comments