తణుకు. మే 06 (ప్రజా అమరావతి);
*రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ చేయించి, నష్టం జరిగినప్పుడు వెనువెంటనే రైతులకు అందించి ఆదుకున్న ఘనత ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కు తుందని రాష్ట్ర పౌరసర ఫరాలు, వినియోగ దారుల శాఖ మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరావు అన్నారు*...
శనివారం తణుకు పురపాలక సంఘం సమావేశ మందిరంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగ దారుల శాఖ మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరావు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఇంబ్బందులు పడకూడదని ,పంట అంతా కోనుగోలు చెయ్యాలని , సకాలంలో డబ్బులు చెల్లించాలని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి మంత్రులకు,జిల్లా యంత్రాంగం కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నార
ని అయన అన్నారు. ఆన్లైన్ గాని ఆప్ లైన్లో గాని ధాన్యం కొనుగోలు చెయ్యాలని అధికారులకు ఆదేశించామన్నారు. గోనె సంచులు, వాహనాలు కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అయన అన్నారు. ప్రభుత్వం తరపున ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ చేయించి నష్టం జరిగి నప్పుడు వెనువెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందించిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వం దక్కుతుందని అయన అన్నారు.ప్రతి పక్ష నాయ కుడు అలోచన లేకుండా మాట్లాడు తున్నారని ఆయన పాలనలో రైతు లకు ఇన్పుట్ సబ్సిడీ గాని మరి ఇతర ప్రయోజనాలు కల్పించారా , ఈ రోజు ప్రతి పక్ష నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని అయన మాటలు ఎవ్వరూ నమ్మట లేదని ఆయన అన్నారు.రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనాలు కల్పించి,రైతు శ్రేయస్సు కోసం అను నిత్యం ముఖ్య మంత్రి ఆలోచనలు చేసి అనేక పథకాలు అమలు చేసి చూపిస్తున్నారని అయన అన్నారు. రైతుకు పంట నష్టం జరిగిన నెల లోనే ఇన్సూరెన్స్ అందించి రైతు లను ఆదుకుంటున్నామన్నారు. రోడ్లల పై ఉన్న ధాన్యాన్ని త్వరగా రైతు బరోసా కేంద్రాలకు తరలించి , మిగతా రైతులకు ధాన్యం అరబెట్టుటకు అవకాశం కల్పించు టకు చర్యలు తీసుకుంటున్నామ న్నారు. నాణ్యమైన ఎరువులు , పురుగు మందులు,సబ్సిడీతో ఆధునిక యంత్రాలు పంపిణీ చేసి రైతులకు ఎంత అవకాశం ఉంటే అంత ప్రయోజనాలు కల్పిస్తు న్నామని అయన అన్నారు.ప్రతి పక్షం ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నారని,మన ప్రభుత్వం పండుగ అని రైతులకు లాభ సాటి వ్యవసాయానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కారుమూరి.వెంకట నాగేశ్వరావు అన్నారు.
ఈ పాత్రికేయుల సమావేశంలో వివిధ శాఖలు అధికారులు, నాయకులు, తది తరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment