సంచార దంతవైద్య వాహనం ప్రారంభం.
*సంచార దంతవైద్య వాహనం ప్రారంభం


*


మంగళగిరి, గుంటూరు జిల్లా (ప్రజా అమరావతి): జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ఎం), జాతీయ దంత ఆరోగ్య కార్యక్రమం (ఎన్ఓ హెచ్ పి)లో భాగంగా విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాల ఆస్పత్రికి చెందిన సంచార దంత వైద్య వాహనాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని శుక్రవారం మంగళగిరి ఎపిఐఐసి భవనం ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సంచార దంతవైద్య వాహనంలో దంత సమస్యలకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు, ఫిల్లింగ్లు, దంతాల్ని శుభ్రం చేయడం , తొలగించడం ,  మందులివ్వడం వంటి   వైద్య సేవలను అందచేస్తారని విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్  డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సంచార దంత వైద్య వాహనం ద్వారా సమీపంలోని 

 ఎంపిక చేసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , వృద్ధాశ్రమాలు , అంధుల పాఠశాలలు, వినికిడి లోపం గల పిల్లల పాఠశాలలలో  చికిత్సలు అందిస్తారు. 

కోల్గేట్ అందించిన రెండు వాహనాల్లో ఒకటి విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు మరొకటి కడప దంత వైద్య కళాశాలకు కేటాయించారు.

 ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ ఎంటి క్రిష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు ఎన్ హెచ్ఎం మిషన్  డైరెక్టర్ శ్రీ  జె నివాస్, స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ వెంకట రవి కిరణ్, నేషనల్  ఓరల్ హెల్త్ ప్రోగ్రాం స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఇ ప్రశాంత్,  స్టేట్ ఓరల్ హెల్త్ కన్సల్టెంట్ డాక్టర్ సౌజన్యలక్ష్మి తదితరులు   పాల్గొన్నారు.

Comments