రైతులకు సలహాలు ,సూచనలు అందించి రైతుల ఆదాయం పెంచాలి.


నెల్లూరు:మే 30 (ప్రజా అమరావతి);

పశు వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పశుపోషణలో రైతులకు సలహాలు  ,సూచనలు అందించి రైతుల  ఆదాయం పెంచాల


ని జిల్లా కలెక్టర్ఎం. హరి నారాయణన్ అన్నారు. కలెక్టరేట్ లోని శంకరన్ హాల్ లో పసు సంవర్ధక శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష చేసారు . ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల లో రైతులకు అదనపు ఆదాయన్నిచ్చే పశువులకు, గొర్రెలకు,మేకలకు, తదితర వాటికి సరైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలువేసి  వాటిని సంరక్షించాలన్నారు. పశు వైద్యులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పశువిజ్ఞానబడులకు హాజరై రైతులలో పశు పోషణ పట్ల అవగాహన పెంచి, ఆదాయం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గొర్రెల పెంపకం దారుల సహకార గురించి కలెక్టర్ ఆరా తీశారు.

పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు మహేశ్వరుడు జిల్లాలో పశుసంవర్ధక  అమలు చేస్తున్న పథకాలైన పాడి పశువుల పెంపకం, పశుగణాభివృద్ధి, పశువుల మేతకు అందిస్తున్న సహకారం, పశువిజ్ఞానబడులు, తదితర అంశాలను సమావేశంలో వివరించారు. నెల్లూరు బ్రీడ్ గొర్రెలకు రాష్ట్రవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు., ఈ సమావేశంలో  పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, వెటర్నరీ సర్జన్లు పాల్గొన్నారు.

Comments