అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు జీ .సీతారాం,ఆదిలక్ష్మి త్రిపర్ణ లు.



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);



* అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు జీ .సీతారాం,ఆదిలక్ష్మి త్రిపర్ణ లు




* అంగన్వాడీ కేంద్రాలకు  కోడి గుడ్లు సరఫరా చేసే గుత్తేదారును బ్లాక్ లిస్ట్ లో పెట్టండి 


కమిషన్ సభ్యులు  సీతారాం, ఆదిలక్ష్మి త్రిపర్ణ


 అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యత లేని, బరువు తక్కువ ఉన్న కోడిగుడ్లు పంపిణీ  జరుగుతున్నట్టు

తమ తనిఖీల్లో గుర్తించడం జరిగిందని, ఆయా గుత్తేదారులని బ్లాక్ లిస్టులో ఉంచాల్సిందిగా

అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం, ఆదిలక్ష్మి త్రిపర్ణ లు పేర్కొన్నారు.


 

 శనివారం రాజమహేంద్రవరం నగరంలోని ఇన్నీసుపేట లోని 3 వ అంగన్వాడీ , 4 వ అంగన్వాడీ కేంద్రాలను తనికీ చేశారు . ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గోండు సీతారాం మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు ద్వారా పిల్లలకి అంద చేస్తున్న పౌష్టిక ఆహార పదార్థాల నాణ్యత ను పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆయా కేంద్రాలకు ఆకస్మికంగా తనిఖీ చేస్తూన్నట్లు తెలియ చేస్తూ, సరఫరా చేస్తున్న కోడిగుడ్లు నాణ్యత పరిశీలంచా మన్నారు. అయితే నిబంధనలకు విరుద్దంగా గుత్తేదారుల కోడిగ్రుడ్లు  సరఫరా చేస్తున్నట్లు తమ పరిశీలనలో వెల్లడైందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్థేశించిన మెనూకు అనుగుణంగా కోడి గుడ్లు సరఫరా చేయిని గుత్తేదారులను బ్లాక్ లిస్ట్ లో పెట్టేలా జిల్లా అధికారులకు సూచనలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆమేరకు సిఫార్సు చేనున్నట్టు వారు పేర్కొన్నారు.      రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న కమిషన్ సభ్యులు ఇన్నీసుపేట 3, 4 అంగన్వాడి కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలుతో అక్కడ అందచేస్తున్న ఆహారం పై మాట్లాడారు. పౌష్టికాహారంలో భాగంగా కోడి గుడ్లు, పాలు, బాలామృతం ఎలా పంపిణీ చేస్తున్నారో అడిగి తెలుసు కున్నారు. స్టాక్ రిజిస్టర్ లు పరిశీలించారు.  గత మూడు నెలలుగా తక్కువ బరువున్న నాణ్యత లేని కోడి గుడ్లు సరఫరా చేస్తున్న విషయాన్ని లబ్ది దార్లు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు.


    అంగన్వాడీ సెంటర్లు లో  నాణ్యత లేని, బరువు తక్కువ ఉన్న కోడిగుడ్లు ఎక్కువ సంఖ్యలో పంపిణీ జరుగుతున్నట్టు గ్రహించామని  ఆదిలక్ష్మి అన్నారు, దీనివల్ల పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పూర్తి స్థాయిలో అందనట్టు తాము భావించి కాంట్రాక్ట్ రద్దుకు తాము సిఫారసులు చేయనున్నామని అన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే గుత్తేదార్లు శతశాతం బరువు, నాణ్యతతో కూడినవి అందించాల్సిందేనని అన్నారు.  లేకుంటే బ్లాక్ లిస్టులో పెట్టే ఆదేశాలు అన్ని జిల్లాల్లో అమలు జరిగేందుకు వెనుకడుగు వేసేది లేదన్నారు, అంగన్వాడి కేంద్రాల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి నిలపనున్నామని అన్నారు.


 ఈ పర్యటనలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రోజెక్ట్ ఆఫీసర్ సి. హెచ్.వి. నరసమ్మ, సూపర్వైజర్ బి.వరలక్ష్మి, బి.రమేష్ , మహిళా సంరక్షణ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.



Comments