నెల్లూరు నగరానికి చేరుకున్న మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి

 

నెల్లూరు. మే 2  (ప్రజా అమరావతి);

మంగళవారం సాయంత్రం నెల్లూరు నగరానికి చేరుకున్న మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి


( acting chief justice) జస్టిస్ టి. రాజాకు జిల్లా కలెక్టర్ ఎం .హరి నారాయణన్, ఏసీబీ కోర్టు జడ్జ్ సత్యవాణి స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద స్వాగతం పలికారు. అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేసిన ప్రధాన న్యాయమూర్తితో కలెక్టర్ కొద్ది సేపు మాట్లాడారు.

ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకున్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి టి .రాజా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో మొబైల్ కోర్టు జడ్జి లావణ్య,నెల్లూరు ఆర్డీవోశ్రీ మాలోల పాల్గొన్నారు.


Comments