నష్టపోయిన రైతులను ఆదుకునే వరకు ప్రభుత్వాన్ని వదలి పెట్టం.

కొవ్వూరు (ప్రజా అమరావతి);

 *తూ.గో జిల్లాలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు 3 వ రోజు పర్యటన వివరాలు* 

 *కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న ధాన్యం పరిశీలించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు* 

పొలాల్లో తడిచిపోయిన ధాన్యాన్ని పరిశీలించిన చంద్రబాబు

రైతులను అడిగి సమస్య తెలుసుకున్న చంద్రబాబు

ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే చేతి కందిన ధాన్యం తడిచిపోయిందని చంద్రబాబు ముందు కన్నీటి పర్యంతమైన రైతులు

ప్రతి మిల్లులో ధాన్యం ఆడించడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వాపోయిన రైతులు

 *ఎస్. ముప్పవరంలో రైతులనుద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.....* 

రైతులు కష్టాల్లో ఉంటే జగన్ ఎక్కడ? సీఎంకి రైతుల్ని పరామర్శించే బాధ్యత లేదా? 

అకాల వర్షాలకు రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు 

వైసీపీ నేతలు, మిల్లరులు కలిసి రైతుల్ని దోపిడి చేస్తున్నారు 

మిల్లర్లు ఎందుకు డబ్బులు కట్టించుకుంటున్నారు , వారికి లైసెన్సు ఏమైనా ఇచ్చారా? 

72 గంటల్లో ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఎవరు పారబోయొద్దు

ధాన్యం కొనుగోలు చేయకపోతే మనమే సీఎం జగన్ నివాసం తాడేపల్లి ప్యాలెస్ తీసుకువెళ్దాం 

సీఎం జగన్ ఇంటి ముందు ఈ ధాన్యం తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి

పోరాడితే నష్టం లేదు.. కేసులు పెడతారని రైతులు  భయపడొద్దు 

నష్టపోయిన రైతులను ఆదుకునే వరకు ప్రభుత్వాన్ని వదలి పెట్టం


రైతులకు అండగా ఉంటాం, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం


 *నిడదవోలు నియోజకవర్గం కాట కోటేశ్వరం  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  మీడియా సమావేశంలో మాట్లాడుతూ.....* 

ఏపీలో దళారుల రాజ్యం నడుస్తుంది

రైతు దగా ప్రభుత్వమే ఇది

ప్రభుత్వ వైఫల్యమే రైతుల పట్ల శాపంగా మారింది

దళారులు దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

భారీ వర్షాల వల్ల ధాన్యం రైతులు బాగా నష్టపోయారు,  తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయడం లేదు.

ధాన్యం పొలం నుంచి నేరుగా రైస్ మిల్ కు వెళ్లాలి, సంచులు లేక ధాన్యం పొలంలోనే తడిసిపోయాయి.

ప్రభుత్వ వైఫల్యం వల్లే ధాన్యం రైతులు నష్టపోయారు, పంటంతా నీట మునగడం వల్ల పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. 

నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు, ఆర్బీకే వ్యవస్థ ఏమైంది?.. సైకో జగన్ చెప్పాలి 

ధాన్యం రైతులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదు, మా పంట మునిగింది.. పరిహారం ఇవ్వాలనే నినాదంతో ఆందోళనలు నిర్వహిస్తాం

మంత్రులు సొల్లు కబుర్లు ఆపి ధైర్యముంటే రైతుల దగ్గరకు రావాలి, సీఎం క్షేత్రస్థాయికి వస్తే వాస్తవాలు తెలుస్తాయి.

తాడేపల్లి కొంపలో కూర్చుంటే వాస్తవాలు తెలియవు, నేను వచ్చాక రైతులకు గోనె సంచులు పంపారు. 

రైతులకు ధైర్యం ఇవ్వడానికే నేను వచ్చా, పోలీసులు బ్యాడ్జ్ లు పెట్టుకోకుండా వచ్చి రైతులను బెదిరిస్తున్నారు 

రైతులకు దైర్యంగా నేను నిలబడతా, రైతులకు న్యాయం జరిగే వరకూ.. వారి తరపున పోరాడతా.

రైస్ మిల్లర్లు సీఎం ఒత్తిడికి లోనై రైతులను ఇబ్బంది పెట్టొద్దు, రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లర్లు జైలుకు వెళ్లక తప్పదు.

డబ్బులు తీసుకున్న మిల్లర్లపై అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతాం, పోలీసులు కేసు తీసుకోకపోతే ప్రైవేట్ కేసు వేస్తాం. 

రైతులు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు , మీకు అండగా నేనుంటా ప్రభుత్వంపై పోరాడదాం.

రైతుల ముందు నేనుంటా.. అరెస్ట్ చేస్తే నన్ను చేయనివ్వండి,

ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు న్యాయం చేయించే బాధ్యత నాది, రైతులు ఐక్యమత్యంగా ఉంటేనే న్యాయం జరుగుతుంది.

పేద రైతులు, కౌలు రైతులంటే జగన్ కి  లెక్క లేదు, అహంభావంతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

72 గంటల డెడ్ లైన్ అయ్యాక మళ్లీ నేను వస్తా.. అప్పట్నుంచి పోరుబాటే, 72 గంటల తర్వాత నా పోరాటం ఎలా ఉంటుందో వైసీపీ ప్రభుత్వానికి చూపిస్తా 


 *నిడదవోలు నియోజకవర్గం సమిస్త్రి గూడెంలో రైతులను ఉద్దేశించి చంద్రబాబునాయుడు ప్రసంగం :-* 

ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు రోజుల్లో 8 నియోజకవర్గాల్లో పర్యటించాను. రైతుల కష్టాలు, బాధల్ని చూశా. 

ధాన్యం సేకరణలో పాత విధానం తీసివేసి....ఆర్ బికె వ్యవస్థను తీసుకువచ్చారు.

రైతు భరోసో కేంద్రాలు.రైతు దగా కేంద్రాలుగా తయారయ్యాయి. 

పంట అమ్ముకునే రైతుకు డబ్బు ఇవ్వకపోగా...వారే డబ్బలు కట్టాలి అంటున్నారు

ఆర్బికె నిబంధనల ప్రకారం పనిచేస్తుందా లేదా....సిఎం చెప్పాలి, నిబంధనలు అమలు అయితే రైతులు మిల్లుకు డబ్బు ఎందుకు కట్టాలి? ఎందుకు టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదు.

మిల్లర్లు ట్రాక్టర్ కు 20 వేల రూపాయలు కూడా కట్టించుకుంటున్నారు.

రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న మిల్లర్లపై ఎందుకు కేసులు పెట్టలేదు.మిల్లర్లు వసూలు చేసిన డబ్బు తాడేపల్లి ప్యాలెస్ కో పోతుంది...అందుకే వారిపై కేసులు పెట్టడం లేదు.

ఆర్బికె సెంటర్ లో మొన్నటి వరకు ఆన్ లైన్ అన్నారు...మళ్లీ ఆఫ్ లైన్ అంటున్నారు. అందుకే తుగ్లక్ పాలన అనేది.

ఏ తప్పు చేయని ఆదిరెడ్డి అప్పారావుపై కేసుపెట్టిన ప్రభుత్వం....రాజమండ్రి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం తప్పు చేసిన రైస్ మిల్లర్ల పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? 

మద్దతు ధర రూ. 1530 ఎందుకు ఇవ్వడం లేదు....రైతుల నుంచి కొట్టేసిన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తుందో తేలాలి

రైతులు భయపడవద్దు...పిరికి తనం వద్దు...మీకోసం నేను అండగా ఉంటా

నేడు రైతు, కౌలు రైతు నాశనం అయ్యారు. ఏప్రిల్ 1 నుంచి ఎందుకు ధాన్యం సేకరించలేదు. సంచులు ఎందుకు సిద్దం చేయలేదు. 

తెలుగు దేశం ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు, నాడు అక్రమాలకు  పాల్పడితే  రైస్ మిల్లర్లు సహా అందరినీ అరెస్టు చేశాం.

సివిల్ సప్లై కార్పొరేషన్ గా భాస్కర్ రెడ్డి....మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన కొడుకు, ఇంకో కొడుకు ఎమ్మెల్యే. వీరంతా కలిసి రైతుల్ని దోచుకుంటున్నారు.

జగన్ పెళ్లిళ్లు, పేరంటాల్లో బిజీ గా ఉన్నాడు. రైతులు పట్టడం లేదు.

ప్రభుత్వం బస్తాకు రూ.1530 ఇచ్చి తీరాలి. పొలంలో ఉండే పంటకు బీమా చేయించలేదు. దీంతో రైతులునష్టపోయారు. 

వరి పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలి, మెక్కజొన్నకు కూడా ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి.

రైతులు ఏం నష్టపోయారో వీడియోలు తీసి పంపండి. ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేలా ఒత్తిడి తెద్దాం, వాళ్లు ఇవ్వకపోతే...టీడీపీ ప్రభుత్వం వచ్చాక నష్టపరిహారం ఇస్తాం.  

పాడైన ధాన్యం సేకరించకపోతే....జగన్ ఇంటికి ఈ ధాన్యం పంపుదాం. ఆయన ఎలాగూ బయటకు రాడు....మనమే అక్కడికి ఈ ధాన్యం పంపుదాం.

72 గంటల్లో ప్రభుత్వం మొత్తం ధాన్యం కొనుగోలు చేయకపోతే...పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తాం.

Comments