పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పిలుపునిచ్చారు..



మచిలీపట్నం మే 15 (ప్రజా అమరావతి);


పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పిలుపునిచ్చారు.



సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఐ కిషోర్, కే ఆర్ ఆర్ సి ఎస్డిసి శివ నారాయణ రెడ్డి తో కలిసి పర్యావరణ రక్షణ కొరకు జిల్లా అధికారులందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.


పర్యావరణ పరిరక్షణ కోసం మన దినచర్యలలో సాధ్యమైనన్ని మార్పులు చేసుకోవాలని,  అనునిత్యం మన కుటుంబమును స్నేహితులను ఇతరులను పర్యావరణ సహిత అలవాట్లు అలవర్చుకునే దిశగా ప్రేరేపించేందుకు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు.


ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ డ్వామా ఐసిడిఎస్ పిడిలు పిఎస్ఆర్ ప్రసాద్, జి వి సూర్యనారాయణ స్వర్ణ, డిపిఓ నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, సర్వే భూ రికార్డుల ఏడి గోపాల్, జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర రావు, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి సరస్వతి, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, సిపిఓ వై శ్రీలత, ముడావిసి రాజ్యలక్ష్మి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.



Comments