టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ భేటీ.



*టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్  కమిటీ భేటీ


*


హైదరాబాద్ (ప్రజా అమరావతి):- తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తో ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్  కమిటీ భేటీ అయ్యింది. హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తీసుకువస్తున్న సావనీర్ విడుదల, వెబ్ సైట్ ప్రారంభంపై చర్చించారు. విజయవాడలో ఎన్టీఆర్ అసెంబ్లీ, చారిత్రిక ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ చేసిన కమిటీ....తదుపరి కార్యక్రమం అయిన సావనీర్, వెబ్ సైట్ పై దృష్టి పెట్టింది. సావనీర్ విడుదల కార్యక్రమానికి సినీ,రాజకీయ రంగాలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు, ఆయనతో పని చేసిన వ్యక్తులు, నేటి తరం నాయకులకు ఆహ్వానించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కమిటీకి పలు సూచనలు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు అన్ని వర్గాలు ఆసక్తి చూపుతున్నాయని... ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములు చేయాలని కమిటీకి సూచించారు. హైదరాబాద్ లో నిర్వహించే సావనీర్ విడుదల కార్యక్రమ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కమిటీ చైర్మన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్ తెలిపారు.

Comments