తూర్పు గోదావరి జిల్లాకు ప్రతిష్టాత్మకమైన రెడ్ క్రాస్ అవార్డ్.

 *తూర్పు గోదావరి జిల్లాకు ప్రతిష్టాత్మకమైన రెడ్ క్రాస్ అవార్డ్.*


విజయవాడ (ప్రజా అమరావతి);

     తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ శాఖకు  ప్రతిష్ఠాత్మక రెడ్ క్రాస్ విభాగం అవార్డ్ రావడం జరిగిందని, అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు,  జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. సోమవారం విజయవాడ  రాజ్ భవన్ దర్భార్  హలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్  చేతుల మీదుగా అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమము జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ చైర్మన్, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, 'ఒక చెట్టును నాటండి- గ్రహాన్ని రక్షించండి' అనే థీమ్‌తో భారీ చెట్ల పెంపకం ప్రచారం మరియు “దానం చేయండి” అనే థీమ్‌తో రక్తదాన ప్రచారం వంటి కార్యక్రమాలు రాష్ట్ర రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలలో చేపట్టిన కార్యక్రమాలు‌, అందించిన సేవలు అభినందనీయం అన్నారు.  బ్లడ్-సేవ్ ఎ లైఫ్' , రాష్ట్రంలో పచ్చదనం పెంపుపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత వివరాలు తెలియచేస్తూ,  వివిధ జిల్లాల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, సామాజిక చైతన్య వంతమైన కార్యక్రమాలు అమలు కోసం నిధుల సేకరణ నేపథ్యంలో అవార్డ్ ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈమేరకు జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవార్డ్ కి నిర్దేశించిన గడువులోగా సుమారు రూ.40 లక్షల మేర విరాళాలు సేకరణ చెయ్యడం జరిగిందన్నారు.  ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో జిల్లా రెడ్ క్రాస్ శాఖ ద్వారా సేవా కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక అంశాలపై అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ అరుదైన గౌరవం మన జిల్లాకు దక్కడంలో జిల్లా యంత్రాంగం, కార్పొరేట్ సంస్థలు, రెడ్ క్రాస్ యూనిట్ భాగస్వామ్యం వల్ల సాధ్యం అయినట్లు మాధవీలత తెలిపారు. అవార్డ్ వచ్చిన సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు కలెక్టర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Comments