మచిలీపట్నం, మే 1 (ప్రజా అమరావతి);
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారులకు మంజూరు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల
ని సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన " జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2023-24" లను సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఏ నెలలో సంబంధిత అధికారులు లబ్ధిదారులకు అందజేయవలెనో షెడ్యూల్ వివరిస్తూ క్యాలెండర్లో పేర్కొన్నారు. జిల్లా అధికారులు వారి శాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సూచనల మేరకు పంపిణీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఈ క్యాలెండర్లను జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేయాలని సంయుక్త కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శివ నారాయణ రెడ్డి, మచిలీపట్నం ఆర్డిఓ ఐ కిషోర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ చైతన్య, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎం.వెంకటేశ్వర ప్రసాద్, డి ఎల్ డి ఓ సుబ్బారావు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment