నెల్లూరు/ పొదలకూరు. మే.7 (ప్రజా అమరావతి);
విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంతో తోడేరు పరిసర ప్రాంత రైతుల, ప్రజల సుదీర్ఘ కల నెరవేరింద
ని రాష్ట్ర వ్యవసాయ సహకార , మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు. పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో 2 కోట్ల 60లక్షల రూపాయల వ్యయంతో ఏ.పీ. ఎస్. పి . డి. సి. ఎల్ .సంస్థ నిర్మించిన 33/11 కె.వి విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి ,తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం.గురు మూర్తి, ఎమ్మెల్సీ మేరుగ మురళి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల
తోడేరు చుట్టుపక్కల గ్రామాల రైతులకు ,గృహ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. దీనికి నిధులు మంజూరు చేసిన అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు రికార్డు సమయంలో దీనిని పూర్తి చేసి ప్రజలకు అందజేశారన్నారు. తన తండ్రి ద్వితీయ వర్ధంతి సందర్భంగా సబ్ స్టేషన్ ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
తన తండ్రి రమణారెడ్డి 18 సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్ గా, తన తల్లి 25 సంవత్సరాలు గ్రామ సర్పంచిగా ఎంతో అభివృద్ధి చేశారన్నారు. గ్రామంలో ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి జడ్పీ చైర్మన్ గా ,రెండుసార్లు ఎమ్మెల్యేగా ,రాష్ట్ర మంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారని ఆయన అన్నారు. గ్రామంలో మంచి పాఠశాల, అంగన్వాడీ కేంద్రం గ్రామ సచివాలయం ,పశు వైద్యశాల, ఆర్ఓ ప్లాంట్, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తదితర పనులు ఇతోదికంగా చేపట్టడానికి అవకాశం కలిగిందన్నారు. మా కుటుంబం రాజకీయంగా ఎదగడానికి సహకరించిన ప్రజలందరికీ, తాను ఈ స్థితికి రావడానికి కారణమైన తన తండ్రి రమణారెడ్డికి రుణపడి ఉంటానని అన్నారు.
తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎం .గురుమూర్తి మాట్లాడుతూ 2.6 కోట్ల వ్యయంతో సబ్ స్టేషన్ నిర్మించడం జరిగిందని, దీనివల్ల మండలం లోని తోడేరు, నందివాయి అయ్యగారి పాలెం శాంతినగర్ ,రత్నగిరి వీవర్స్ కాలనీ తదితర గ్రామాల ప్రజలు నాణ్యమైన విద్యుత్ పొందుతారని ఆయన అన్నారు. విద్యుత్ సమస్యలు లేకుండా నిరంతరం విద్యుత్ సౌకర్యం అందుతుందన్నారు
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ యస్. ఈ. వెంకటసుబ్బయ్య, ఈ. ఈ రామకృష్ణా రెడ్డి, డి ఈ సురేందర్ రెడ్డి , ఎ ఇ.దారా భాస్కర్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు , స్థానిక నాయకులు,విద్యుత్ శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.
addComments
Post a Comment