ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయండి !!


 

మచిలీపట్నం : మే 15 (ప్రజా అమరావతి);


*ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయండి !!*
కృష్ణాజిల్లా ప్రజల చిరకాల వాంఛ మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 22 వ తేదీన (వచ్చే సోమవారం ) వస్తున్నారని, ఆయన  పర్యటను ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ శాసనమండలి సభ్యులు తలసిల రఘురామ్ పిలుపునిచ్చారు.


సోమవారం మధ్యాహ్నం ఆయన మచిలీపట్నంకు విచ్చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రివర్యులు, మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య ( నాని) జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ పి. జాషువా తదితరులతో కలిసి సీఎం పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. 


తొలుత ఆయన స్థానిక చిలకలపూడి స్విమ్మింగ్ పూల్ సమీపంలో జాతీయ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ శిబిర మైదానం వద్ద ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ, స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో హెలిపాడ్, నోబుల్ కళాశాల ప్రాంగణం, తపసిపూడిలోని పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసే స్థలం, పైలాన్ నిర్మాణం, పోర్టు నిర్మాణ సమీపంలోని మరో హెలిపాడ్ తదితర ప్రాంతాలను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు, 

అనంతరం ఎమ్మెల్సీ తలసిల రఘురాం అధికారులకు తగు సూచనలు చేశారు.  జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరగబోయే కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత థామస్ నోబుల్, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, ఆర్డీవో ఐ. కిషోర్, తహసిల్దార్ సునీల్ బాబు, మునిసిపల్ కమిషనర్ చంద్రయ్య, యువజన నాయకుడు పేర్ని కృష్ణమూర్తి ( కిట్టు ), పలువురు కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులు, పలువురు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.Comments