గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలకు సత్వరమే పరిష్కారమార్గం చూపుతున్నామనెల్లూరు, మే 9 (ప్రజా అమరావతి): గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలకు సత్వరమే పరిష్కారమార్గం చూపుతున్నామ


ని  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు. 

మంగళవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం మహ్మదాపురం గ్రామంలో రెండోరోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తమ ఇంటి బిడ్డ వచ్చినంత ఆనందంతో గ్రామస్థులంతా ముఖ్యంగా మహిళలు వీధి వీధినా పూల వర్షం కురిపించారు. 


అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు అడిగిన పనుల్లో సత్వరం పరిష్కరించే పనులను 24 గంటల్లో పరిష్కరిస్తున్నామని, సోమవారం మహ్మదాపురం గ్రామంలో పర్యటించినప్పుడు ఒక మహిళ చేదోడు పథకం రెండోసారి తనకు రాలేదని చెప్పగా, వెంటనే విచారించి ఏరియా కోఆర్డినేటర్ ద్వారా చేదోడు పథకం కింద రూ 10,000 మంజూరు చేయించామని, ముగ్గురు వికలాంగులు ట్రై సైకిల్స్ కావాలని అడగగా వారికి కూడా ట్రై సైకిల్స్ 24 గంటల్లోనే అందించామని మంత్రి పేర్కొన్నారు. వార్డు సభ్యుడు నుంచి మంత్రి వరకు ప్రతి గడపకు వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ, వారి సమస్యలను పరిష్కరించే ఎంతో విశిష్టమైన కార్యక్రమం గడపగడపకు మన ప్రభుత్వం అని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగనన్నకు చెబుదాం అనే మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు నేరుగా ఫోన్ చేసి సమస్యలను తెలియజేయవచ్చని, వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మండల స్థాయి వరకు అధికార యంత్రాంగం పనిచేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలు కోరుకున్న అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, భవిష్యత్తులో కూడా మరింత ఎక్కువగా ప్రజా సంక్షేమానికి పనిచేస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. 

ఈ కార్యక్రమంలో  ఎంపీడీవో నగేష్ కుమారి, తహసీల్దార్ ప్రసాద్, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Comments