నేడు స్మార్ట్ టౌన్ షిప్ ప్లాట్ల విక్రయం ప్రారంభం



*నేడు స్మార్ట్ టౌన్ షిప్ ప్లాట్ల విక్రయం ప్రారంభం*


పార్వతీపురం, మే 3 (ప్రజా అమరావతి): సాలూరు పట్టణంలో బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థ వేస్తున్న లే అవుట్ లో ప్లాట్ల విక్రయం గురు వారం ప్రారంభం అవుతుంది. యుమ్.ఐ.జి. లేఔట్ లోని ప్లాట్లను కొనుగోలుదారులు, కొనుగోలు చేయుటకు గురు వారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర  https://migapdtcp.ap.gov.in వెబ్ సైట్ ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం సాలూరు శివాలయం రోడ్ లో ఉన్న సీతారామ ధర్మశాలలో నిర్వహిస్తున్నారు. 


సాలూరు పట్టణ ప్రజల సొంత నివాస కలల్ని నిజం చేయటానికి బొబ్బిలి పట్టణాభిృద్ధి సంస్థ "జగనన్న స్మార్ట్ టౌన్ షిప్" పథకంలో సాలూరు మునిసిపాలిటీ పరిధిలో రెండు లేఔట్లు వేస్తుంది. 184 ఇళ్ల స్థలాలు సకల సౌకర్యాలతో రూపొందించుటకు పట్టణాభిృద్ధి సంస్థ ప్రణాళిక తయారు చేయటం జరిగింది. లేఔట్ మొత్తం సిమెంట్ రోడ్లు, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, వీధి దీపాలు, మంచి నీటి రిజర్వాయర్ నిర్మాణము, పిల్లల ఆటలకు పార్కు తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. "జగనన్న స్మార్ట్ టౌన్ షిప్" లేఔట్ స్థలము సాలూరు జాతీయ రహదారి - దూద్ సాగరం గ్రామ రహదారికి ఆనుకొని వేయడం జరుగుతుంది.  


ఆసక్తి ఉన్న కొనుగోలు దారులు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ (http://migadtep.ap.gov.in) వెబ్ సైట్ ద్వారా మే 4వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుగోలు చేయవచ్చని బొబ్బిలి పట్టణాభిృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు కె.మయూర్ అశోక్ తెలిపారు.

Comments