రాష్ట్రఆర్థికపరిస్థితి, అప్పులపై దువ్వూరి చెప్పినవన్నీ అసత్యాలే.

 *శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ విలేకరుల సమావేశం మాట్లాడతు


*రాష్ట్రఆర్థికపరిస్థితి, అప్పులపై దువ్వూరి చెప్పినవన్నీ అసత్యాలే.


టీడీపీహాయాంలో సంవత్సరానికిచేసిన అప్పు రూ.35వేలకోట్లు అయితే, వైసీపీప్రభుత్వం చేసిన అప్పు రూ.లక్షకోట్లు.*

 అమరావతి (ప్రజా అమరావతి);

మూలధనవ్యయం అన్నిరాష్ట్రాల్లో సరాసరి 14శాతముంటే, ఏపీలో కేవలం 9శాతమేనని కాగ్ చెప్పింది నిజంకాదా?

ప్రజల తలసరిఅప్పు 2019లో రూ.60వేలు ఉంటే, ఈరోజు రూ.1,35,000లకు ఎందుకు పెరిగిందో దువ్వూరి చెప్పాలి.  

బడ్జెట్ కేటాయింపులు-ఖర్చులు, కేపిటల్ ఎక్స్  పెండేచర్ వివరాల్ని జగన్ ప్రభుత్వం ఎందుకు ప్రజలముందు ఉంచడంలేదో దువ్వూరి చెప్పాలి.

ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, ఇతరవర్గాలకు ఉన్న బకాయిల వివరాలపై ప్రభుత్వం తక్షణమే పూర్తివాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం. 
ముఖ్యమంత్రి ప్రత్యేకకార్యదర్శి దువ్వూరి కృష్ణ రాష్ట్రఆర్థికపరిస్థితి బాగుందని, ప్రజలకు స్ప ష్టంగా వాస్తవాలుతెలిసేలా జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారని చెప్పడంచూస్తే, చిన్నవయ సులో పెద్దపెద్ద అబద్ధాలుచెప్పే నేర్పరితనం ఆయనకు ఎలా వచ్చిందా అనే సందేహం కలుగు తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సందేహం వ్యక్తంచేశారు . 


మంగళగిరిలోనిపార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే మీకోసం...!


“4ఏళ్లలో వైసీపీప్రభుత్వం రూ.75,400కోట్ల మూలధనవ్యయం (కేపిటల్ ఎక్స్ పెండేచర్) ఖర్చు చేసినట్టు, గతప్రభుత్వం 5ఏళ్లలో రూ.76,139కోట్లు ఖర్చుపెట్టినట్టు దువ్వూరి కృష్ణచె ప్పడం విడ్డూరంగా ఉంది. 4ఏళ్లలో వైసీపీప్రభుత్వ బడ్జెట్ రూ.12,18,079 కోట్లు అయితే, గతప్రభుత్వ ఐదేళ్లబడ్జెట్ కలిపి రూ.7,08,624కోట్లుమాత్రమే. ఈ రెండింటినీ ఎలా పోలుస్తా రు? కాగ్ చెప్పినట్టు 2021-22లో అన్నిరాష్ట్రాల సరాసరి మూలధనవ్యయం మొత్తంఖర్చులో 14శాతం, ఆంధ్రప్రదేశ్ లోచేసింది కేవలం 9.1శాతం మాత్రమే. ఈ  వాస్తవాన్ని కాదనగలరా?

 

*కోవిడ్ తోప్రభుత్వ ఆదాయం తగ్గిందన్న దువ్వూరి వ్యాఖ్యలు అసత్యాలు.*

జగన్మోహన్ రెడ్డి అసమర్థతను కప్పిపుచ్చేందుకు దువ్వూరి కృష్ణ కోవిడ్ అని, సరిగా పన్ను లు వసూలుకాలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రాల బడ్జెట్ ను విశ్లేషించే  కాగ్ నివేదికను చూస్తే ఈ ప్రభుత్వడొల్లతనం ఏమిటో తెలుస్తుంది. 2018-19లో టీడీపీప్రభుత్వానికి రూ.58,107కోట్ల ఆదాయం పన్నులరూపంలో వస్తే,  2023-24లో రూ.1,02,651కోట్ల ఆదాయం వస్తుందని జగన్ ప్రభుత్వమే చెబుతోంది.

 అలానే కేంద్రప్రభుత్వ గ్రాంట్లరూపంలో 2018-19సంవత్సరానికి టీడీపీ ప్రభుత్వంలో రూ.19,456కోట్లు వస్తే, 2021-22లో రూ.46,834 కోట్లువచ్చాయి. మొత్తం రెవెన్యూ ఆదాయం పరిశీలించినాకూడా టీడీపీప్రభుత్వంకంటే వైసీపీప్రభుత్వానికి లక్షకోట్లకు పైగా ఎక్కువ ఆదాయం వచ్చింది.  తమప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పేదలసంక్షేమానికి ఎక్కువ ఖర్చుపెట్టినట్టు దువ్వూరిచెప్పారు. టీడీపీప్రభుత్వంలో అమలైన సంక్షేమపథకాలు ఎన్ని.. జగన్ అమలుచేస్తున్న పథకాలెన్నో కృష్ణకుతెలియదా? ఇళ్లపట్టాల ముసుగులో పేదలకు పనికిరాని సెంటుపట్టాలు ఇచ్చి, దానికోసం  ఖర్చుపెట్టిన మొత్తాన్ని కేపిటల్ ఎక్స్ పెండేచర్ లోచూపే ప్రయత్నంచేశారు. దానిపై జగన్ ప్రభుత్వానికి కాగ్ మొట్టికాయలు వేసిం ది నిజంకాదా? జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం చేసిన పాపాలను ప్రజలు అను భవి స్తున్నారని దువ్వూరి గ్రహించాలి

.

*టీడీపీప్రభుత్వం సంవత్సరానికి  చేసినఅప్పు రూ.34,975కోట్లు అయితే, వైసీపీప్రభుత్వం సంవత్సరానికి చేసిన అప్పు రూ.99,690కోట్లు.*

2014 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయేటప్పటికి అప్పులు మరియు గ్యారంటీలుకలిపి  రూ.1,32,079.16కోట్లు. 2019 మార్చినాటికి  రాష్ట్రఅప్పు మొత్తం రూ.3,06,952కోట్లు. అంటే  టీడీపీప్రభుత్వం ఐదేళ్లలో చేసినఅప్పు కేవలం రూ.1,74,873కోట్లు, అనగా సంవత్స రానికి రూ.34,975కోట్లు మాత్రమే. (రూ.3,06,952-1,32,079 = రూ.1,74,873 కోట్లు.) 

2023మార్చినాటికి రాష్ట్రప్రభుత్వఅప్పు రూ.4,42,442కోట్లుఅని గ్యారంటీలు రూ.1,44, 875కోట్లు అని కృష్ణగారే చెప్పారు. కానీ బడ్జెట్ వెలుపల చేసిన ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ని రూ.1,18,393కోట్లు కావాలనే ఆయన బయటకు చెప్పలేదు. అన్నింటికి కలిపితే మార్చి 2023నాటికి రాష్ట్రం అప్పు రూ.7,05,710కోట్లు.  అంటే   జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం 4ఏళ్లలో చేసినఅప్పు రూ.3,98,758కోట్లు. అనగా సంవత్సరానికి రూ.99,690కోట్లు.

 

*బడ్జెట్ కేటాయింపులు-ఖర్చులు, కేపిటల్ ఎక్స్  పెండేచర్ వివరాల్ని జగన్ ప్రభుత్వం ఎందుకు ప్రజలముందు ఉంచడంలేదో దువ్వూరి చెప్పాలి.*

రాష్ట్రాభివృద్ధికోసం పెట్టినఖర్చుని బడ్జెట్లోచూపకుండా ప్రభుత్వసొమ్ముని, ప్రజలసొమ్ముని జగన్మోహన్ రెడ్డి సర్కార్ దుర్వినియోగంచేసిందనే వాస్తవం దువ్వూరి గ్రహించాలి. బడ్జెట్ వివరాలు, కేపిటల్ ఎక్స్ పెండేచర్ వివరాల్ని జగన్ సర్కారు ఎప్పుడైనా పారదర్శకంగా ప్రజలముందు ఉంచిందా? 

పవర్ సెక్టార్లో ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు దాదాపు రూ.22వేలకోట్లవరకు ఉన్నాయి. ఈ విధంగా ఇతరరంగాల్లో వేలకోట్లచెల్లింపుల్ని జగన్ సర్కార్ పెండింగ్ లో పెట్టింది. పెన్షన్, జీపీఎఫ్, డీఏలు, టీఏలు, ఇలా ఏవ్యవస్థకు ఎంతమొత్తం పెండింగ్ పెట్టారో పాలకులు చెప్పగ లరా? పాలకులతరుపున దువ్వూరి కృష్ణ వాస్తవాలు బయటపెట్టగలరా? చేతిలో బ్లూమీడి యాఉందని ఏదిపడితే అదిచెప్పడంకాదు. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, ఇతరవర్గాలకు ఉన్న బకాయిల వివరాలపై ప్రభుత్వం తక్షణమే పూర్తివాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం.


*ప్రభుత్వనిర్వాకంతో ప్రజల తలసరిఅప్పపెరిగింది... ఆదాయం పడిపోయింది. నాడు-నేడు పేరుతో విద్యావ్యవస్థను సర్వనాశనంచేసింది జగన్ సర్కార్ కాదా?*

ప్రభుత్వనిర్వాకంతో ప్రజలతలసరి అప్పుఎంతపెరిగిందో, వారి ఆదాయం ఎంత పడిపోయిందో ఆర్థికనిపుణుడు అయిన దువ్వూరికితెలియదా? సీ.ఎఫ్.ఎం.ఎస్ నిధుల్నిఎలా దుర్వినియోగ పరిచారో, తెలియచేస్తూ కేంద్రం ఇచ్చిన వివరణపై ఏంసమాధానంచెబుతారు? కాగ్ ఎన్నిసా ర్లు అడిగినా జగన్ ప్రభుత్వం లెక్కలకు సంబంధించిన వివరాల్ని ఎందుకు చెప్పలేదో దు వ్వూరి సమాధానం చెప్పాలి. ప్రజలసొమ్ముకి లెక్కలుచెప్పని ప్రభుత్వం దొంగప్రభుత్వం కాదా అని దువ్వూరిని ప్రశ్నిస్తున్నాం. 2018 జూన్ లో ఈ ప్రభుత్వం ఏర్పాటైతే, 2019నాటికే విద్యారంగంలో అద్భుతప్రగతిసాధించామని సిగ్గులేకుండా దువ్వూరి అబద్ధాలుచెప్పారు. గత ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలఫలితాల్ని మీప్రభుత్వఖాతాలో వేసుకోవ డం సిగ్గుచేటుకాదా అనిప్రశ్నిస్తున్నాం. నాడు-నేడు పేరుతో జగన్ ప్రభుత్వంచేసిన పాపాలకు అటు విద్యార్థులభవిష్యత్ తో పాటు, ఇటుఉపాధ్యాయుల జీవితాలు కూడా తలకిందులయ్యా యి. ఇంగ్లీష్ మీడియంపేరుతో రాజకీయాలుచేసి, అంతిమంగా విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారు. ఎన్.సీ.ఆర్ నివేదికప్రకారం 2017లో ప్రాథమికవిద్యను అందించడంలో దేశం 65.07 శాతం పురోగతిసాధిస్తే, ఏపీమాత్రం 75.03శాతం సాధించింది. కానీ2021లో  మూడో తరగతిప్రవేశాల్లో దేశ వ్యాప్తంగా 59శాతం ప్రగతినమోదైతే, ఏపీలో మాత్రం54శాతానికే పరిమితమైంది. అలానే 5 వతరగతి ప్రవేశాల్లోకూడా  ఏపీ 53శాతానికే పరిమితమైంది.

ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకుండా, డీఎస్సీ నిర్వహించకుండా, స్కూళ్లను విలీనంచే సి, అంతిమంగా ప్రాథమికవిద్యదశలోనే విద్యార్థులజీవితాల్ని తుంచేసింది జగన్ ప్రభుత్వం కాదా?  టీడీపీప్రభుత్వంలో పదోతరగతి ఫలితాల్లో ఏపీ దేశంలోనే రెండోస్థానంలో నిలిస్తే, ఇ ప్పుడు అట్టడుగుస్థానంలో నిలిచింది నిజంకాదా? ఇవేవీ దువ్వూరి కంటికి కనిపించడంలేదా ?  జగన్ అవినీతి,దోపిడీతో అధోగతిపాలైన రాష్ట్రం రూపురేఖల్ని ప్రజలకు తెలియకుండా చేయడంకోసం దువ్వూరి మసిపూసి మారేడుకాయచేసే ప్రయత్నం చేశాడు.” అని ఆలపాటి స్పష్టంచేశారు.

Comments