*స్మార్ట్ టౌన్ షిప్ ప్లాట్ల విక్రయం ప్రారంభం
*
పార్వతీపురం, మే 4 (ప్రజా అమరావతి): సాలూరు పట్టణంలో బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థ వేస్తున్న లే అవుట్ లో ప్లాట్ల విక్రయం గురు వారం ప్రారంభం అయ్యింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర గురు వారం సాలూరు శివాలయం రోడ్ లో ఉన్న సీతారామ ధర్మశాలలో ప్లాట్ల విక్రయంను ప్రారంభించారు. యుమ్.ఐ.జి. లేఔట్ లో ప్లాట్లను కొనుగోలుదారులు, కొనుగోలు చేయుటకు https://migapdtcp.ap.gov.in వెబ్ సైట్ లో ఆన్లైన్ ప్రక్రియలో దరఖాస్తు చేయాలి. సాలూరు పట్టణ ప్రజల సొంత నివాస కలల్ని నిజం చేయటానికి బొబ్బిలి పట్టణాభిృద్ధి సంస్థ "జగనన్న స్మార్ట్ టౌన్ షిప్" పథకంలో సాలూరు మునిసిపాలిటీ పరిధిలో రెండు లేఔట్లు వేస్తుంది. 184 ఇళ్ల స్థలాలు సకల సౌకర్యాలతో రూపొందించుటకు పట్టణాభిృద్ధి సంస్థ ప్రణాళిక తయారు చేయటం జరిగింది. లేఔట్ మొత్తం సిమెంట్ రోడ్లు, భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, వీధి దీపాలు, మంచి నీటి రిజర్వాయర్ నిర్మాణము, పిల్లల ఆటలకు పార్కు తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. "జగనన్న స్మార్ట్ టౌన్ షిప్" లేఔట్ స్థలము సాలూరు జాతీయ రహదారి - దూద్ సాగరం గ్రామ రహదారికి ఆనుకొని వేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న కొనుగోలు దారులు జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ (http://migadtep.ap.gov.in) వెబ్ సైట్ ద్వారా మే 4వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుగోలు చేయవచ్చు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్ళు ఉండాలని ప్రభుత్వ ధ్యేయం అన్నారు. "జగనన్న స్మార్ట్ టౌన్ షిప్" లలో అన్ని సౌకర్యాలతో లే అవుట్ లు నిర్మాణం జరుగుతుందని ఆయన చెప్పారు.
బొబ్బిలి పట్టణాభిృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ 9.47 ఎకరాల్లో ఒక లే అవుట్, 5.40 ఎకరాల్లో రెండవ లే అవుట్ వేస్తున్నామని చెప్పారు. మొదటి లే అవుట్ లో 109 ప్లాట్లు వేస్తున్నామని అందులో 150 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 39, 200 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 35, 240 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 3, వివిధ కొలతల చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 32 ఉన్నాయన్నారు. గజం ధర రూ.5 వేలు నిర్ణయించామని చెప్పారు. రెండవ లే అవుట్ లో
75 ప్లాట్లు వేస్తున్నామని అందులో 150 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 22, 200 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 18, 240 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 6, వివిధ కొలతల చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 39 ఉన్నాయన్నారు. గజం ధర రూ.4,800 నిర్ణయించామని చెప్పారు. ప్లాట్లు కొనుటకు సంవత్సర ఆదాయం రూ.18 లక్షలకు మించరాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్లాట్ విలువలో 20 శాతం రాయితీ, 10 శాతం ప్లాట్లు కేటాయింపు ఉంటుందని చెప్పారు. ప్లాటు విలువ ఒకేసారి చెల్లించిన వారికి 5 శాతం రాయితీ లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు తో 10 శాతం, అగ్రిమెంట్ అయినప్పటి నుండి నెల రోజులలో 30 శాతం, ఆరు నెలల లోపు 30 శాతం, 12 నెలల లోపు 30 శాతం చెల్లించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బొబ్బిలి పట్టణాభిృద్ధి సంస్థ అధ్యక్షులు ఇంటి పార్వతి, సాలూరు మునిసిపల్ చైర్ పర్సన్ ఈశ్వరమ్మ, కమీషనర్ హెచ్. శంకర రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అనంత కుమారి, బొబ్బిలి పట్టణాభిృద్ధి సంస్థ ఏపిఓ డి.ఎస్.వి. కుమార్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment