ప్రతి విద్యార్థికి నాణ్యమైన జగనన్న విద్యాకానుక కిట్ అందించాలి.

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*పాఠశాల విద్యాశాఖ - సమగ్ర శిక్షా*

విజయవాడ (ప్రజా అమరావతి);


ప్రతి విద్యార్థికి నాణ్యమైన జగనన్న విద్యాకానుక కిట్ అందించాలి


*

రాష్ట్రంలోని మండల స్టాకు పాయింట్ల క్వాలిటీ కంట్రోల్ కమిటీ సభ్యులకు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారి సూచనలు

జేవీకే కిట్ నాలుగు దశల్లో నాణ్యాతా పరీక్షలు

మండల క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఉత్సాహంగా పని చేయాలి*

మండల స్టాకు పాయింట్లలో ఏర్పాటు చేసిన ‘క్వాలిటీ వాల్’ను అనుసరించాలిరాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యాకానుక’లో వస్తువులు ప్రతి విద్యార్థికి తప్పకుండా అందించాలని, ఏ విద్యార్థీ ఏదైనా వస్తువు అందలేదనే ఫిర్యాదు తమ దృష్టికి రాకూడదని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు  రాష్ట్రంలోని అన్ని మండల స్టాకు పాయింట్లలోని మండల విద్యాశాఖాధికారులను ఉద్దేశిస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల దిల్లీలోని బ్యాగులు, బూట్లు తయారీ కేంద్రాల పరిశీలించిన విషయం తెలిసిందే. శనివారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో జి.కొండూరు, మైలవరం, ఎ.కొండూరు, రెడ్డిగూడెం మండలాల్లోని జగనన్న విద్యాకానుక మండల స్టాక్ పాయింట్లను సందర్శించారు. స్టాకు పాయింట్లకు చేరిన యూనిఫాం క్లాత్, బెల్టులు, పాఠ్య పుస్తకాలు తదితర వస్తువుల నాణ్యతను యాదృచ్ఛికంగా తనిఖీ చేసి, నాణ్యత ప్రమాణాలతో సరిపోల్చి సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ఆయన స్వయంగా గమనించిన విషయాలను రాష్ట్రంలోని అన్ని మండల స్టాకు పాయింట్లలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ కమిటీలకు పలు సూచనలు చేశారు. 

*మండల క్వాలిటీ టీమ్ ఉత్సాహంగా పని చేయాలి*

ప్రతి విద్యార్థికి నాణ్యతతో కూడిన  కిట్ అందించాలంటే మండల స్టాకు పాయింట్ లో ఉన్న క్వాలిటీ కంట్రోల్ కమిటీ సభ్యులు ఉత్సాహంగా పని చేయాలని కోరారు. జగనన్న విద్యాకానుకలో ప్రతి వస్తువుకు సంబంధించి ఉత్పత్తి సామగ్రి (రా మెటిరీయల్) నుండి  తయారయ్యాక మండల స్టాకు పాయింటుకు వచ్చేంత వరకు నాణ్యత నిర్దేశాలను క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా మూడు దశల్లో పరీక్షిస్తుందన్నారు.  నాలుగో దశలో రాష్ట్రంలోని అన్ని మండల స్టాకు క్వాలిటీ కంట్రోల్ యూనిట్ పకడ్బందీగా తనిఖీ చేయాలని సూచించారు. దీనికోసం ప్రతి మండల స్టాకు పాయింట్లలో ఏర్పాటు చేసిన ‘క్వాలిటీ వాల్’లోని వస్తువులతో, సరఫరాదారుల నుంచి వచ్చిన వస్తువులను రాండమ్ గా తనిఖీ చేయాలని, విద్యార్థికి ఇచ్చిన ప్రతి వస్తువు కూడా నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో సరిపోల్చాలని  ఆదేశించారు.  దీనికి సంబంధించి మండల స్టాకు పాయింట్లలో కమిటీ సభ్యులంతా ఉత్సాహంతో పని చేస్తూ జగనన్న విద్యాకానుకలోని ప్రతి వస్తువు నాణ్యత, తదితర వివరాలను (స్పెసిఫికేషన్లను) తెలుసుకుంటే పని మరింత  తేలికవుతుందని ఆదేశించారు.   సరఫరాదారుల నుంచి వచ్చిన జేవీకే వస్తువులను మండల స్టాకు పాయింట్లకు ఇచ్చిన నిబంధనల ప్రకారం 6 లేదా 7 గదులు ఏర్పాటు చేసి వస్తువులకు కేటాయించిన స్థలాల్లో జాగ్రత్తగా భద్రపరచాలని తెలిపారు.  ఏదైనా సమస్య వస్తే స్వయంగా ఆయన వాట్సప్ నంబరు(90131 33636) కు మెసేజ్ చేయండని కోరారు.

Comments