వాలంటీర్లకు వందనం.

 

అమరావతి (ప్రజా అమరావతి);


*వాలంటీర్లకు వందనం*


*వరసగా మూడో ఏడాది ... ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానం*


*నేడు (19.05.2023) విజయవాడ ఎ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో లాంఛనంగా  ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


తొలి కోడి కూయకముందే, తూర్పు తెలవారకముందే, ఎండైనా, వానైనా. ఆదివారం అయినా, పండగైనా, సెలవు రోజైనా ప్రతి నెలా మొదటి తారీఖునే ఠంఛన్‌ గా మీ గడప వద్దకు వచ్చి, మీ తలుపు తట్టి, చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించి శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లను అవ్వాతాతలకు అందించడంతో పాటు వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ, పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించడం, అర్హులందరికీ లబ్ధి అందేలా చేయి పట్టుకొని నడిపిస్తూ, ప్రతి 50 ఇళ్లకు ఒక బిడ్డగా ఉంటూ శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలబడి సేవాభావంతో లంచాలు, వివక్షకు తావులేకుండా సేవలందిస్తున్న వాలంటీర్‌ చెల్లెమ్మలకు, వాలంటీర్‌ తమ్ముళ్లకు సెల్యూట్‌ చేస్తూ వారి సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అందిస్తున్న చిరు సత్కారం..



అవినీతికి తావులేకపోవడం, సచ్ఛీలత, ఇంటింటి సర్వే, పెన్షన్ల పంపిణీ, హాజరు, యాప్‌ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం, రేషన్‌ డోర్‌ డెలివరీ, పెన్షన్‌ కార్డు, రైస్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయించడం తదితర అంశాల్లో పనితీరు ప్రామాణికంగా అవార్డులకు ఎంపిక


*రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,719 మందికి రూ. 243.34 కోట్ల నగదు పురస్కారాలు*. 


*నేడు అందిస్తున్న రూ. 243.34 కోట్లతో కలిపి ఇప్పటివరకు వాలంటీర్లకు శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన నగదు పురస్కారాల మొత్తం రూ. 705.68 కోట్లు*


గ్రామ/వార్డు వాలంటీర్లు తమ పరిధిలోని 50/100 కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నందుకు... గ్రామ/ వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య మంచి సంధానుకర్తలుగా వ్యవహరించినందుకు...


అనినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్దిదారులను గుర్తించడంలో సహాయకారిగా వ్యవహరించినందుకు...


కోడి కూయకముందే ఇంటి తలుపు తట్టి, చిరునవ్వుతో గుడ్‌ మార్నింగ్‌ చెప్పి మరీ ఠంచన్‌ గా పింఛన్లు, ప్రతి నెల ఒకటో తారీఖునే అందిస్తున్నందుకు...


మీరు చేస్తున్నది ప్రజలందరికి మంచి చేసే గొప్ప సేవ... శభాష్‌ వాలంటీర్‌


పెన్షన్లతో పాటు రేషన్‌ డోర్‌ డెలివరీ, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ళ పట్టాలతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్దిదారులందరికీ నిర్దిష్ట కాల పరిమితిలో అందేందుకు సహాయపడుతున్నందుకు..


వరదలు, విపత్తులు, ప్రమాదాల సమయంలో సహాయ కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను ఆదుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరియు ’దిశ’ వంటి ముఖ్యమైన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించినందుకు...


జగనన్న సంక్షేమ క్యాలెండర్‌ను అనుసరించి ఎప్పుడు ఏ పథకం అమలవుతుందో ప్రజల దగ్గరకు వెళ్లి వివరించి అవసరమైతే దగ్గరుండి దరఖాస్తు చేయించే సేవా సైనికులైనందుకు...


....సేవా సైన్యానికి సలాం..


*మే 19 వ తారీఖు నుండి అన్ని నియోజకవర్గాల్లో పండగ వాతావరణంలో వాలంటీర్లకు అవార్డుల ప్రదానం మొదలు..*


*కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు..*  


*సేవా వజ్ర*


సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 30,000 నగదు బహుమతి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లకు 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాల ప్రధానం


*సేవా రత్న*


సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 20,000 నగదు బహుమతి. ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 10 మంది చొప్పున టాప్‌ 1 శాతం ర్యాంకు సాధించిన వాలంటీర్లకు, మొత్తంగా 4,220 మందికి సేవా రత్న పురస్కారాల ప్రధానం


*సేవా మిత్ర*


సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 10,000 నగదు బహుమతి. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన వాలంటీర్లకు 2,28,624 మందికి సేవా మిత్ర పురస్కారాల ప్రధానం.

Comments