ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా ప్రజలందరికీ వైద్యం అందజేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధానలక్ష్యమ


నెల్లూరు (ప్రజా అమరావతి);


ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా ప్రజలందరికీ వైద్యం అందజేయడమే రాష్ట్ర ప్రభుత్వ  ప్రధానలక్ష్యమ


ని, ఈ విధానాన్ని ప్రజలు  సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్, గ్రామస్థులకు సూచించారు.


బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీమతి శోభిక తో కలసి కొండాపురం మండలంలో విస్తృతంగా పర్యటించారు.  తొలుత  కొండాపురం మండలం, ఆదిమూర్తిపురం గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో ఫ్యామిలీ ఫిజీషియన్ విధానంలో  గ్రామస్తులకు  అందిస్తున్న సేవలను, నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను,   జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్ మాట్లాడుతూ,  గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యాన్ని చేరువ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ డాక్టరు విధానాన్ని తీసుకురావడం జరిగిందని,

 గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.  గ్రామాలలో కుటుంబ డాక్టరు విధానంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నప్పుడు గ్రామస్థులకు ముందస్తు సమాచారం ఇవ్వడం ద్వారా గ్రామస్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని  వైద్యులకు సూచించారు.   రక్తహీనత కలిగిన చిన్నారులు, మహిళలు, గర్భిణీ స్త్రీలపై, షుగర్ వ్యాధిగస్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సంధర్భంగా వైద్య పరీక్షలు చేసుకునేందుకు  వచ్చిన గ్రామస్తులతో  మాట్లాడి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.


అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్  మినీ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీచేసి,  అంగన్వాడీ కేంద్రంలో ఎంత మంది పిల్లలు వున్నారు,  వారికి సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అని  రిజిస్టర్స్ ను పరిశీలించారు.

రిజిస్టర్స్ నమోదు విదానంపై  చిన్నపిల్లల ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు  అప్లోడ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.


తదుపరి కొండాపురం లోని ఎపి మోడల్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన జగనన్న విద్యా కానుక మండల స్థాయి స్టోరేజ్ పాయింట్ ను జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్, సందర్శించి, విద్యా కానుక కిట్స్ ను పరిశీలించారు. పాఠశాలల విద్యార్థులకు సక్రమంగా నిర్ణీత గడువులోగా జగనన్న విద్యా కానుక కిట్స్ అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.  ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో  ఫెయిల్ అయిన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను   జిల్లా కలెక్టర్ పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడటం జరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థులందరు మంచి మార్కులతో పాస్ అయ్యేలా   విద్యార్థులను సన్నద్ధం చేయాలని కలెక్టర్, జిల్లా విద్యా శాఖాధికారి గంగా భవానీ, సమగ్ర శిక్ష ఎపిసి ఉషారాణి లను ఆదేశించారు. 


అనంతరం కొండాపురం మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్  ఆకస్మికంగా  తనిఖీ  చేసి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు.  ఆసుపత్రిలోని వ్యాక్సిన్ రూము ను, డెలివరీ వార్డును, రక్త పరీక్షల విభాగాన్ని, వైద్య సేవ వార్డులను జిల్లా కలెక్టర్ సందర్శించి సంబందిత రిజిస్టర్స్ ను పరిశీలించారు.    ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్, వైద్యులను ఆదేశించారు. కలెక్టర్ వెంట  డిప్యూటి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ప్రియంవద, ఆసుపత్రి డాక్టర్ డా వినీతా రెడ్డి, తహశీల్దార్ మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. 


అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్, కొండాపురం మండలం, నేకునాంపేట జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి, పాఠశాలలో జరుగుచున్న మన బడి నాడు నేడు పనులను పరిశీలించారు.   పాఠశాలలో జరుగుతున్న విద్యుత్ పనులు, ఫ్లోరింగ్, టాయిలెట్స్, కిచెన్ షెడ్ పనులను పరిశీలించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నిర్దేశించిన అన్నీ పనులు పూర్తి చేయాలని, అందుకనుగుణంగా ప్రతి రోజు పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.  


కలెక్టర్ వెంట డీఈఓ గంగాభవాని, సమగ్ర శిక్ష ఎపిసి ఉషారాణి,   తహశీల్దార్ మహమ్మద్ హుస్సేన్, ఎంపిడివో బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. 



Comments