స్పందన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు




మచిలీపట్నం మే  9 (ప్రజా అమరావతి);


స్పందన అర్జీలను  పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు


తప్పవని జిల్లా కలెక్టర్ పి.  రాజాబాబు అధికారులను హెచ్చరించారు.


మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డిఆర్ఓ, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించి స్పందన, జగనన్నకు చెబుదాం, రీ సర్వే, వైఎస్ఆర్ జగనన్న గృహ నిర్మాణం - పేదలందరికీ ఇళ్లు, నాడు నేడు, మీసేవ, వ్యవసాయం, ఉద్యానం, ఉపాధి హామీ తదితర అంశాలపై మండలాల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు.



ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు.


స్పందన అర్జీల నాణ్యమైన పరిష్కారానికి గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో పటిష్టంగా పనిచేయుటకు జిల్లా మండల డివిజన్ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

స్పందన అర్జీ వస్తే ఎలా పరిష్కరించాలో సరైన అవగాహన చాలా ముఖ్యమన్నారు.

స్పందన అర్జీలు తక్కువ వస్తే అప్పుడే నిజంగా జిల్లా  యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసినట్లు అవుతుందన్నారు.  స్పందన అర్జీదారులకు సరైన సమాధానం ఇవ్వాలని లేకపోతే ఇకపై బాధ్యుల పైన క్రమశిక్షణ చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఏదైనా సమస్య పరిష్కరించలేక పోతే అందుకు సరైన కారణాలు అర్జీదారునికి  అర్థమయ్యేలా అర్జీదారునికి అర్థమయ్యేలా వివరించాలన్నారు.


మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వారంలో కనీసం  మూడు లేదా నాలుగు రోజులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి వారి శాఖకు చెందిన అంశాలనే కాకుండా స్పందన అర్జీలు,  జగనన్నకు చెబుదాం అర్జీలు  ఏ విధంగా పరిష్కారం అయ్యాయో ఒకసారి గమనించాలన్నారు.


 పరిష్కరించినప్పటికీ మళ్లీ దరఖాస్తులు పెట్టుకుంటున్న అర్జీదారులతోనూ, అసంతృప్తితో ఉన్న అర్జీదారులతోనూ ఒకసారి మాట్లాడి వారి సమస్యను ఎంతో ఓపిగ్గా ఆలకించి సానుకూలంగా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.  వారికి అనుకూలంగా చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నామో వారికి తెలియజేయాలన్నారు.


స్పందన అర్జీల పరిష్కారం పై వచ్చే 15 రోజుల్లో జిల్లా ప్రత్యేక అధికారి సమీక్షిస్తారని ఆలోగా అన్నీ కూడా సజావుగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.


గ్రామ మండల డివిజన్ స్థాయిల్లో సంబంధిత అధికారులు వారి పరిధిలో అర్జీదారుల సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించాలన్నారు


జిల్లాలో కష్టం హైరింగ్ కేంద్రాలకు అనుబంధంగా రైతు సంఘాలను ఇప్పటివరకు 90% ఏర్పాటు చేశారని మిగిలిన రైతు సంఘాలను కూడా త్వరగా ఏర్పాటుచేయాలన్నారు. 


జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల  ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని ఈనెల 15వ తేదీ లోగా  వీఆర్వోలు,గ్రామ వ్యవసాయ సహాయకులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి నివేదికలు అందజేయాలన్నారు.


మీసేవ ద్వారా వచ్చే అర్జీలు కూడా గడువు దాటి ఉండరాదని వాటిని సకాలంలో పరిష్కరించాలన్నారు.


సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు సంబంధిత శాఖలు సర్వే కార్యక్రమాన్ని సత్వరమే పూర్తి చేయాలన్నారు.


పాఠశాలల్లో చేపట్టిన నాడు నేడు అభివృద్ధి పనులు నిర్ణయించిన కాల పరిమితి ప్రకారం పూర్తి చేయాలన్నారు.


వైఎస్ఆర్ జగనన్న గృహ కాలనీలో  గృహాల నిర్మాణంలో వెనుకబడిన 10 మండలాలు వారంలోగా నూటికి నూరు శాతం పురోగతి సాధించాలని లేనిపక్షంలో బాధ్యులైన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జగనన్న కాలనీలో నీరు విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం సరైనది కాదని సూచించారు.


ప్రభుత్వ పథకాల అమలులో కొన్ని మండలాలు బాగా పురోగతి సాధిస్తున్నాయని పురోగతి సాధించలేని మండలాలకు చెందిన అధికారులు మంచి పురోగతి సాధిస్తున్న అధికారులతో సంప్రదించి ఎలా చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. 


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరేట్ నుంచి డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు,డిపిఓ నాగేశ్వర నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి విజయభారతి, సర్వే భూ రికార్డుల ఏడి గోపాల్ ,డి ఎల్ డి వో సుబ్బారావు,  డిటిడబ్ల్యు ఓ ఫని దూర్జటి తదితర జిల్లా అధికారులు ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దారులు పాల్గొన్నారు




Comments