సచివాలయాలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల వారీగా పక్కాగా ప్రణాళిక తయారు చేసుకుంటేనే గృహ నిర్మాణంలో పురోగతి సాధ్యమవుతుంది.


నెల్లూరు  మే 8 (ప్రజా అమరావతి);


సచివాలయాలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల వారీగా పక్కాగా ప్రణాళిక తయారు చేసుకుంటేనే గృహ నిర్మాణంలో పురోగతి  సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్ స్పష్టం చేశారు.


సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు,  ఎంపీడీవోలతో గృహ నిర్మాణాలపై వీడియోకాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ మాట్లాడుతూ పనితీరు మార్చుకోని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. గృహ నిర్మాణంలో ప్రతివారం తప్పనిసరిగా పురోగతి కనిపించాలన్నారు.  యం పి డి ఓ లు సంబంధిత ఎ ఇ లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల తో ప్రతి రోజు సమీక్షించుకుని, క్షేత్ర స్థాయిలో పర్యటించి, పనుల పురోగతిపై వ్యక్తిగత శ్రద్ద పెట్టి పనిచేయాలన్నారు. గృహ నిర్మాణoలో వివిధ దశలను దాటేందుకు ఖచ్చితమైన ప్రణాళిక వేసుకుని, అందుకనుగుణంగా సమీక్ష చేసుకుంటూ ఉన్నప్పుడే వాటిని పూర్తి చేయుటకు అవకాశం ఉంటుందన్నారు   అంతర్గత రోడ్లు లేవని తదితర అనవసరమైన కారణాలతో జాప్యం చేయరాదని సూచించారు. కోర్టు కేసులు ఉన్న వాటిని మినహాయించి మిగిలిన అన్నింటిలో స్టేజ్ కనవర్షన్లు జరగాలన్నారు. ఈ వారం నెల్లూరు నగర పాలక సంస్థ మంచి పురోగతి సాధించిందని, ఇదే స్ఫూర్తిని జిల్లాలోని అన్ని మండలాల్లో కొనసాగించాలన్నారు. అదేవిధంగా గృహ రుణాలు అందచేయడం పై డి ఆర్ డి ఎ, మెప్మా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, ట్రైనీ కలెక్టర్ విద్యాధరి,  హౌసింగ్ పీడీ వెంకట దాసు, డి ఆర్ డి ఎ పిడి సాంబశివరెడ్డి, జడ్పీ సీఈవో చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Comments