నెల్లూరు, మే 18 (ప్రజా అమరావతి): జిల్లాకు గత 15 రోజులకు ప్రభుత్వం కేటాయించిన గృహ నిర్మాణ లక్ష్యాన్ని అధిగమించి జగనన్న ఇళ్ల నిర్మాణాల పురోగతిలో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం
పట్ల జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కేఎస్ జవహర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ అజయ్ జైన్ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కేఎస్ జవహర్ రెడ్డి గురువారం ఉదయం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్నకు చెబుదాం, గృహ నిర్మాణం, రీ సర్వే, జాతీయ రహదారుల, ప్రాజెక్టులకు భూసేకరణ, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖల ప్రగతి తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరి నారాయణన్ కలెక్టరేట్ లోని వారి చాంబర్ నుండి జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మానాథ్ తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ గత 15 రోజులకు సంబంధించి జిల్లాలకు ఇచ్చిన జగనన్న ఇల్లు నిర్మాణ లక్ష్యాలు సాధించడంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని, 9428 ఇళ్ల నిర్మాణాల లక్ష్యానికి గాను 9693 ఇళ్ల నిర్మాణాల వివిధ దశల్లో పురోగతి సాధించి, ఇచ్చిన లక్ష్యం కంటే అదనంగా ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల్లో మంచి ప్రగతి సాధించిన జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కేఎస్ జవహర్ రెడ్డి, అజయ్ జైన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అలాగే బహుళార్థ సాధక గోదాముల నిర్మాణంలో, వైయస్సార్ యంత్ర సేవా పథకంలో భాగంగా కస్టం హైరింగ్ సెంటర్ల ఏర్పాటులో కూడా నెల్లూరు జిల్లా మంచి పురోగతి లో వుందన్నారు.
అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జవహర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు జగనన్నకు చెబుదాం, గృహ నిర్మాణం, రీ సర్వే,భూహక్కు పత్రాల పంపిణీ, ప్రాజెక్టుల భూ సేకరణ, జగనన్న పాలవెల్లువ, పాడి పశువుల పంపిణీ తదితర అంశాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ గా శ్రీ ఎం హరి నారాయణన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హౌసింగ్ పై ప్రతిరోజూ టెలి కాన్ఫరెన్స్ లు, వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం, క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించడం.. ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించడం వంటి చర్యలతో జగనన్న ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, డి ఆర్ డి ఏ, డ్వామా పీడీలు సాంబశివారెడ్డి, వెంకట్రావు, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, పంచాయతీ అధికారి సుస్మిత, ల్యాండ్ రికార్డుల శాఖ ఏడి హనుమాన్ ప్రసాద్, హౌసింగ్ ఈఈ నాగరాజు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఎస్ఈలు రంగవరప్రసాద్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment