చిన్నపిల్లలకు వైద్య సదుపాయం, పోషకాహారం అందించడానికి పటిష్టమైన ప్రణాళిక తయారు చేయాలి.

 

నెల్లూరు: మే.30 (ప్రజా అమరావతి);

 పెరుగుదలలేని, బరువు తక్కువగా ఉన్న చిన్నపిల్లలకు వైద్య సదుపాయం, పోషకాహారం అందించడానికి పటిష్టమైన ప్రణాళిక తయారు చేయాల


ని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ సంబంధిత అధికారులకు సూచించారు.  పిల్లలలో పౌష్టికాహార లోపం, ప్రత్యేక అవసరాలుగల పిల్లలు , కంటి వెలుగు తదితర అంశాలపై కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ, ఐ సి డి ఎస్, విద్యాశాఖ అధికారులతో మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో జరిగిన సమావేశంలో 

 చర్చించారు.

పౌష్టికాహార లోపం వల్ల బరువు, పెరుగుదల తక్కువగా ఉన్న 0-6 సంవత్సరాలు మధ్య ఉన్న పిల్లల ఆరోగ్యం పట్ల అధికారులు ,సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అన్నారు. అంగన్ వాడి కేంద్రాలలో ప్రతి నెల 1నుండి 10 వ తారీకు వరకు పిల్లల బరువు ,ఎత్తు కొలతలు సక్రమంగా చేయాలని అన్నారు. ఆ పది రోజులు ఐసిడిఎస్ అధికారులు ప్రత్యేకంగా మానిటర్ చెయ్యాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పౌష్టికాహార లోపం ఉన్నవారిని గుర్తించి వారికి పీడియాట్రిషన్ ద్వారా వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నపిల్లల వైద్యున్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి పి హెచ్ సి లకు పంపించి వైద్యం అందించే విధంగా ప్రణాళిక చెయ్యాలని సూచించారు. జూన్ నుంచి అమలయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ ఆసుపత్రికి పెద్ద ఎత్తున దాతల నుండి సహకారం అందుతుందని అలాగే పిల్లలలో పౌష్టికాహార లోపం తగ్గించడానికి స్థానికంగా ఉన్న దాతల నుండి సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో  ఐ ఆర్ సి ఎస్, ఐఎంఏ సహకారం తీసుకోవాలని సూచించారు.   

0-18 ఏళ్ళ వయసు గల ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి మెడికల్ క్యాంపులకు తీసుకువెళ్లి  సర్టిఫికెట్లు జారీ అయ్యేవిధంగా చూడాలని, ఆధార్ లేనివారికి ఆధార్ కార్డు ఇప్పించాలని  కలెక్టర్ అన్నారు. వైయస్సార్ కంటి వెలుగు పథకంలో ఆత్మకూరు ,కావలి డివిజన్లో కంటి ఆపరేషన్లు మెరుగుపడాలన్నారు. అందరికీ కళ్ళజోళ్ళు అందే విధంగా చూడాలన్నారు

సమావేశంలో డి సి హెచ్ ఎస్ రమేష్ నాయక్, ఐసీడీఎస్ పీడీ సౌజన్య, ,DEO గంగా భవాని, సమగ్ర శిక్ష పిడి ఉషారాణి,

అంధ నివారణ సొసైటీ డాక్టర్ శార్వాణి, జిల్లా టిబి కంట్రోల్ అధికారి  వెంకట ప్రసాద్ జిల్లా ఇమ్మ్యునైజేషన్ అధికారి  డాక్టర్ సెలీనా కుమారి తదితరులు పాల్గోన్నారు.

Comments