*పట్టు చెన్నూరు పంచాయతీలో ఉప ముఖ్యమంత్రి పర్యటన
*
పార్వతీపురం, మే 1 (ప్రజా అమరావతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర కొటియా గ్రామాలైన పట్టు చెన్నూరు గ్రామ సచివాలయం పరిధిలో సోమ వారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టు చెన్నూరు, పగుల చెన్నూరు, ఎగువ మెండంగి, కోనధార, సోలిపి గూడ గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి కలిగింది తెలిపారు. బడుగు బలహీనవర్గాలు ముఖ్యంగా గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేయడం జరుగుతోందని ఆయన చెప్పారు. గ్రామాలకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి కి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి, పూల మాలలతో ముంచెత్తారు.
ఈ కార్యక్రమంలో మండల, గ్రామ సచివాలయం సిబ్బంది, అధికార, అనధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment