పునాది నుంచే నాణ్యమైన విద్య అవసరం

 *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం*

*పాఠశాల విద్యాశాఖ- సమగ్ర శిక్షా*

విజయవాడ (ప్రజా అమరావతి);


*పునాది నుంచే నాణ్యమైన విద్య అవసరం


*

పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు

మహిళా శిశుసంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో చర్చా సమావేశం


ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలంటే ఉపాధ్యాయులకు ఉత్తమ శిక్షణ అవసరమని,   అంగన్వాడీల్లో పిల్లలకు బోధించే గ్రేడ్ 1, 2 ఉపాధ్యాయులకు వేసవిల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే యోచనలో ఉన్నామని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్  అన్నారు.  మంగళవారం విజయవాడలోని  SALT (ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సపోర్టింగ్) కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐఏఎస్ అధికారులు మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ముద్దాడ రవిచంద్ర, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం. విజయసునీత , సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈసీసీ (expanded core curriculum) అంగన్వాడీ కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాల గురించి చర్చ జరిగింది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు ఎస్సీఈఆర్టీ ద్వారా ‘ట్రైనింగ్ సర్టిఫికేట్’ అందించనున్నామని తెలిపారు. దీనికి సంబంధించి కోర్సు, ప్రణాళిక, వచ్చే ఏడాది కూడా ఇవ్వబోయే ఈ శిక్షణకు ముందస్తుగా క్యాలెండర్, మాడ్యూళ్లు వంటివి రూపొందిస్తామని తెలిపారు.  శిక్షణ ద్వారా విద్యార్థులకు సమర్థవంతంగా బోధించగలిగే ఉపాధ్యాయులను తీర్చిదిద్దవచ్చని అన్నారు. 

ఈ సమావేశంలో సీమ్యాట్ డైరెక్టర్ శ్రీ వి.ఎన్.మస్తానయ్య , ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి , సాల్ట్,  సమగ్ర శిక్షా, ఎస్సీఈఆర్టీ, సీమ్యాట్, శామో సిబ్బంది పాల్గొన్నారు. 


 



Comments