కెనడా మరియు USA లలో జూన్, జూలై నెలల్లో 14 నగరాల్లో శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణోత్సవాలు



తాడేపల్లి (ప్రజా అమరావతి);


*తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో కెనడా మరియు USA లలో జూన్, జూలై నెలల్లో 14 నగరాల్లో  శ్రీ మలయప్ప స్వామి వారి                                                                                                              కళ్యాణోత్సవాలు



*   



*పత్రికా ప్రకటన విడుదల చేసిన APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి* 


కెనడా మరియు USA దేశాలలో స్థిరపడిన  తెలుగు, భారతీయుల కోసం జూన్ 4వ తేదీ నుండి  జూలై 23 వ  తేదీవరకు పద్నాలుగు (14) నగరాలల్లో శ్రీ మలయప్ప స్వామి వారి  కళ్యాణములు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ  వై.వి. సుబ్బారెడ్డి  వెల్లడించారు.  కెనడా మరియు USA దేశాలలో  “శ్రీనివాస కళ్యాణోత్సవం” పోస్టర్లను తితిదే అధ్యక్షులు శ్రీ వై.వి. సుబ్బారెడ్డి, APNRTS అధ్యక్షులు శ్రీ, వెంకట్ ఎస్. మేడపాటి, టూరిజం అధ్యక్షులు శ్రీ వరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు - స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి, కాపు కార్పోరేషన్ అధ్యక్షులు శ్రీ అడపా శేషు మరియు ఇతర కార్పోరేషన్ల డైరెక్టర్లు టిటిడి చైర్మన్ తాడేపల్లి  కార్యాలయంలో   ఆవిష్కరించారు.  అనంతరం శ్రీ వై.వి. సుబ్బారెడ్డి   మాట్లాడుతూ...  ముఖ్యమంత్రి శ్రీ  వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  ఆదేశం మేరకు రాష్ట్ర, దేశ, విదేశాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహించాలని నిర్ణయించాము. ఇందులో భాగంగా  జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ 2022 నెలల్లో USA, UK & Europe లలోని  20 నగరాల్లో అత్యంత వైభవంగా శ్రీ  మలయప్ప స్వామి వారి కళ్యాణాలు ఆయా దేశాలలోని తెలుగు అసోసియేషన్ల మరియు ధార్మిక సంస్థల సహకారంతో  నిర్వహించామన్నారు.  గత నెల 28వ తేదీన బహ్రెయిన్ లో నిర్వహించిన కళ్యాణోత్సవానికి దాదాపు 15 వేలమందికి  పైగా భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారన్నారు.


కెనడా మరియు USA లలోని పలు  తెలుగు అసోసియేషన్లు, ధార్మిక,సేవా సంస్థల  కోరిక మేరకు ఆయా దేశాలలోని భక్తులకోసం తితిదే  శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ  APNRTS ఆయా నగరాల్లోని కార్యనిర్వాహకులతో సమన్వయము చేస్తోందన్నారు. 


తితిదే నియమాల ప్రకారం శ్రీవారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది.  తిరుమల శ్రీవారి దేవస్థానం నుండి వెళ్ళే  అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమం మొదలవుతుంది. తిరుమలలో లాగానే  శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది.  ఆయా  నగరాల్లో తెలుగు, భారతీయ అసోసియేషన్లు లడ్డూ ప్రసాదాలతో పాటు, భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా  జాగ్రత్తలు తీసుకుంటారన్నారు. ఉచితంగా శ్రీవారి కళ్యాణోత్సవం తిలకించడానికి అందరూ ఆహ్వానితులే. భక్తులందరూ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించి,  ఆ దేవదేవుడి ఆశీర్వాదాలు పొందాలని కోరారు. 


ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సిద్ధంగా ఉన్నాయని తితిదే ఛైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు. 


APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ... కెనడా మరియు USA దేశాలలో దేవదేవుడైన శ్రీవారి కళ్యాణాలు నిర్వహించడానికి ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, అక్కడ ఏర్పాట్లను, వారికి కావలసిన సామాగ్రి విషయంలో ఇటు తితిదే అర్చకులు, వేదపండితులతో  సమన్వయం చేస్తున్నామన్నారు. 


*కెనడా మరియు USA దేశాలలో “శ్రీనివాస కళ్యాణం” జరిగే నగరాలు, తేదీలు:*


Toronto, ON, Canada  - 4th June, 2023


Montreal, Quebec, Canada – 10th June, 2023


Ottawa, ON, Canada – 11th June, 2023


Raleigh, NC, USA – 17th June, 2023


 Jacksonville, FL, USA – 18th June. 2023


Detroit, MI, USA – 24th June, 2023


Chicago, IL, USA- 25th June, 2023


Atlanta, GA, USA – 1st July, 2023


Dallas, TX, USA – 2nd July, 2023


St. Louis, MO, USA – 6th July, 2023


Philadelphia, PA, USA – 9th July, 2023


Morganville, NJ, USA – 15th July, 2023


Houston, TX, USA – 16th July, 2023


Irving, TX, USA – 21st – 23rd July, 2023 (Srivari Kalyanam & Brahmotsavams)



అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో NRIలు  పాల్గొని, ఆ దేవదేవుడి కృపకు పాత్రులుకాగలరని ఆశిస్తున్నాం.

Comments