రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్లను ప్రారంభించిన సీఎం.



*రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జి సేవలు, 100  జియో టవర్స్‌ను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


అమరావతి (ప్రజా అమరావతి);

– రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు  4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్లను ప్రారంభించిన సీఎం.



– క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం.

– 209 మారుమూల ప్రాంతాలగ్రామాలకు అందనున్న సేవలు.

– అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్‌ జిల్లాలో 2 టవర్లను ప్రారంభించిన సీఎం. 

– టవర్లను ఏర్పాటు చేసిన రిలయెన్స్‌ సంస్థ. 

– భవిష్యత్తులో 5జీ సేవలను అప్‌గ్రేడ్‌ చేయనున్న జియో.

– టవర్లు ఏర్పాటు కారణంగా మారుమూల ప్రాంతాల్లో మరింతగా మెరుగుపడనున్న ప్రభుత్వ సేవలు.

– ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ మరింత కనెక్టివిటీ, మెరుగైన నాణ్యతతో అందనున్న సేవలు.

– విద్యార్థులకు అందనున్న ఇ– లెర్నింగ్‌.

–మరింత మెరుగ్గా అందనున్న ఆరోగ్య సేవలు. 

– ఆర్థికంగానూ ఆయా ప్రాంతాలకు మరింత లబ్ధి.

– రాష్ట్రంలో సెల్‌ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి. 

– మొబైల్, ఇంటర్నెట్‌ సర్వీసులు ద్వారా  మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకూ వారి ముంగిటకే సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం. 

దీంట్లో భాగంగా యూనివర్సిల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఓఎఫ్‌) ద్వారా సెల్‌టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం.

– ప్రస్తుతం ఏర్పాటు చేసిన సెల్‌ టవర్ల పరిధిలో 150 ఎంబీపీఎస్‌ డౌన్లోడ్, 50 ఎంబీపీఎస్‌ అప్‌లోడ్‌ చేసుకునేందుకు ఇప్పుడు అవకాశం ఏర్పడుతుంది.

– కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలతో మాట్లాడుకుని.. మార్గదర్శకాలను సులభతరం చేసుకుని.. సెల్‌టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.

– అవరసమైన మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసిన ప్రభుత్వం.

– ఈ మొత్తం ప్రాజెక్టు కింద కొత్తగా 2,849 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటు. 

– దీనికోసం ఇప్పటికే 2,463 చోట్ల స్థలాలు అప్పగించిన ప్రభుత్వం.

– డిసెంబర్‌ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ.


*కొత్తగాప్రారంభించిన సెల్‌టవర్ల వల్ల మారుమూల ప్రాంతాలనుంచి నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు.*

*ఆయా ప్రాంతాల్లోని గిరిజనులతో ఇంటరాక్ట్‌ అయిన ముఖ్యమంత్రి.*


– అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం భీమవరం నుంచి ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎంపీ గొడ్డేటి మాధవి, అరుకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ప్రజలు. 

– అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం సుబ్బులు గ్రామం నుంచి పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే కొట్టుగుళ్లు భాగ్యలక్ష్మి, పాడేరు ఐటీడీఏ, పీఓ వి అభిషేక్, ఇతర అధికారులు, ప్రజలు.


– పార్వతీపురం మన్యం జిల్లా సికల్‌బాయి గ్రామం నుంచి పాల్గొన్న కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, కలెక్టర్‌ నిషాంత్‌ కుమార్, ప్రజలు.


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...* 

అందరికీ అభినందనలు. కేంద్ర ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్స్‌ విభాగానికి, జియోకు, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిరికీ ధన్యవాదాలు. డిసెంబరు నాటికి రాష్ట్రంలో సెల్‌ సర్వీసులు లేని ఆవాసాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీతో పాటు పెద్ద ఎత్తున మార్పులు రానున్నాయి. 

దీంతో అన్ని సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, స్కూళ్లకూ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లభిస్తుంది. రేషన్‌ పంపిణీ, ఇ–క్రాప్‌ బుకింగ్‌ కూడా సులభమవుతుంది. 

మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును అత్యంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా అక్కచెల్లెమ్మలకు అందించగలుగుతాం.  


అదే విధంగా వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా హాజరైన ప్రజాప్రతినిధులకు, అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ టవర్స్‌ ఏర్పాటు వల్ల మీ అందరికీ ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా మంచి చేసే పరిస్థితులు  రావాలని మనసారా కోరుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

Comments