APSRTC ఉద్యోగస్తులకు గొప్ప శుభవార్త.

 APSRTC ఉద్యోగస్తులకు గొప్ప శుభవార్త


.                          విజయవాడ (ప్రజా అమరావతి);

ఇప్పటివరకూ APSRTC ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ తరువాత చాలా తక్కువగా పెన్షన్ వస్తున్నది.

కండక్టర్ మరియు డ్రైవరు కేటగిరీలలో ఇప్పటివరకూ పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ సుమారుగా రూ.5౦౦౦ /-మాత్రమె ఉండేది. ఈ మొత్తం తో రిటైర్ అయిన ఉద్యోగులు ప్రస్తుత జీవన ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో హయ్యర్ పెన్షన్ కు నమోదు చేసుకునే అవకాశం తెలియనందున మరియు లేనందున, హయ్యర్ పెన్షన్ కు తమకూ అవకాశం కల్పించమని, ఎన్నో ఏళ్ళుగా ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పలు సందర్భాలలో తమ ఆవేదనను వ్యక్త పరిచేవారు. ప్రభుత్వాలకు, EPTO వారికీ విన్నపాలు పంపేవారు. కాని వారి కల ‘కల’ గానే మిగిలి పోయింది.

అయితే, ఇటీవల గౌరవ సుప్రీమ్ కోర్టు  వారి  04. 11.2022వ తేదీ నాటి తీర్పు మరియు ఆదేశాల మేరకు, సర్వీసులో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి హయ్యర్ పెన్షన్ కు అర్హత పొందేందుకు అవకాశం  కల్పించడం జరిగింది.

తదనుగుణంగా, APSRTC ఉద్యోగస్తులకు కూడా హయ్యర్ పెన్షన్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది.

EPFO  వారు గత కొన్ని నెలలుగా  ఈ హయ్యర్ పెన్షన్ విధి విధానాలను ప్రకటించి ఉద్యోగస్తులందరికీ తెలియ పరచడం జరిగింది.

ఈ నూతన హయ్యర్ పెన్షన్ అర్హత ప్రకారం ఆ పెన్షన్ ఇప్పుడు 5 – 6 రెట్ల మేరకు పెరగనున్నది. అంటే సుమారుగా రూ.15,౦౦౦/- నుంచి రూ. 18,౦౦౦/- మేరకు రానున్నది. ఇందువల్ల పదవీ విరమణ చేసిన సిబ్బందిలో మానసిక, ఆర్ధిక స్థైర్యం పెరగనున్నది.

భవిష్యత్తు జీవన ప్రమాణాల మేరకు తామూ బ్రతక గలమనే నమ్మకం ఇప్పుడు ప్రతి ఒక్క APSRTC ఉద్యోగిలోనూ కనిపించనున్నది.

రాష్ట్ర విభజన పరిణామాల నేపద్యంలో, EPTO వారికి చెల్లించవలసిన బకాయిలు మొత్తం APSRTC చాలా కాలం క్రిందటే జమచేయటం మరియు  ఉద్యోగస్తుల ఖాతాలు సమగ్రంగా నిర్వహించడం వంటి ప్రధాన కారణాలవల్ల APSRTC ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ ఆమోద పత్రాలను త్వరిత గతిన పంపిణీ చేస్తున్నారు.  

EPFO వారి గైడ్ లైన్స్, సూచనల మేరకు APSRTC ED (Admin.) శ్రీ KS బ్రహ్మానంద రెడ్డి, FA&CAO శ్రీ రాఘవ రెడ్డి. APSRTC PF TRUST సెక్రటరీ శ్రీమతి అరుణ మరియు సిబ్బంది, తదితరులు ఎప్పటికప్పుడు RTC ఉద్యోగస్తులందరికీ EPFO వారికి పంపే పత్రాలను ఎలా పూరించాలి, ఎలా అప్ లోడ్ చేయాలి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సందేహాలను నివృత్తి చేసేవారు. జిల్లా అధికారులను అప్రమత్తం చేసేవారు. తద్వారా నిర్దిష్ట గడువులోగా దాదాపు అందరి పత్రాలను అప్ లోడ్ చేయడం జరిగింది. 

ఈ క్రమంలో, APSRTC  ప్రధాన కార్యాలయం లో జూనియర్ అసిస్టెంట్ (Finance) గా పని చేస్తున్న శ్రీ జి. సత్యనారాయణకు హయ్యర్ పెన్షన్ నెలకు రూ.25,౦౦౦ /- లుగా నిర్ధారిస్తూ EPFO వారు జారీ చేసిన ఆమోద  పత్రాన్ని APSRTC కి పంపటం జరిగింది. ఆ పత్రాన్ని APSRTC VC & MD శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, IPS గారు ఈ రోజు అనగా ది. 28.062023 ఆయనకు అందజేసి అభినందనలు తెలిపారు.  

మరికొద్ది రోజులలో APSRTC ఉద్యోగులందరికీ హయ్యర్ పెన్షన్ ఆమోద పత్రాలు అందనున్నాయని ఆయన తెలిపారు. 

ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ వారి పదవీ విరమణ అనంతరం గౌరవ ప్రదమైన పెన్షన్ మొత్తాలను పొందాలన్న తన  ఆకాంక్ష చాలా త్వరగా కార్య రూపం దాల్చటం తనకు ఎంతో సంతోషంగా ఉందని VC & MD శ్రీ ద్వారకా తిరుమలరావు, IPS తన హర్షాన్ని వ్యక్తం చేసారు. ఇది  ఉద్యోగస్తులందరూ గర్వకారణంగా భావిస్తున్నారని అన్నారు.

ఇంతేకాకుండా, దేశంలోని ఏ ఇతర పొరుగు RTC సంస్థల ఉద్యోగులకు లేని విధంగా, APSRTC ఉద్యోగులకు మాత్రమె ఈ మహత్తర అవకాశం, ఆమోదం లభించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంబందిత అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. 

Comments