వెనిగండ్ల ఆధ్వర్యంలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు.

 *- వెనిగండ్ల ఆధ్వర్యంలో ఘనంగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు*


 *- అభిమానులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసిన నేతలు*

 *- గుడివాడ మార్కెట్ సెంటర్ లోనూ ఘనంగా వేడుకలు* 

 *- "వెనిగండ్ల అన్నా క్యాంటీన్" ద్వారా నిరుపేదలకు భోజన వసతి* గుడివాడ, జూన్ 10 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నట వారసుడు, హిందుపురం ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం బైపాస్ రోడ్ లోని వెనిగండ్ల కార్యాలయంలో బాలయ్య అభిమానులు, టిడిపి నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేకును కట్ చేశారు. బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గుడివాడ మార్కెట్ సెంటర్ లోనూ బాలయ్య పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.  కేకును కట్ చేసి నిరుపేదలకు పంచారు. వెనిగండ్ల ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నా క్యాంటీన్ ద్వారా భోజన వసతి కల్పించి పేదల ఆకలిని తీర్చారు. అనంతరం జరిగిన సభలో బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజా, తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తా చంటి, గడ్డం ప్రకాష్ దాస్, రాధాకృష్ణ, జోగా బాలకృష్ణ, చల్లగుళ్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ రాజసం, పౌరుషం, మహోన్నత వ్యక్తిత్వం కల్గిన మహామనిషి నందమూరి బాలకృష్ణ అని అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుండి జరిగిన ప్రతి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం బాలయ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ వస్తున్నారన్నారు. 2014, 2019 ఎన్నికల్లో  హిందుపురం నియోజకవర్గం నుండి టీడీపీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారన్నారు. బాలయ్య వైవిద్యమైన పాత్రలను పోషించడంతోపాటు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలతో అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. ఎన్టీఆర్ నట వారసునిగా సినిమా రంగంలోకి వచ్చి వెండితెరపై సత్తా చాటడంలో సింహంగా పేరు తెచ్చుకున్నారన్నారు. బాలయ్య కృషి వల్ల  బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి దేశంలో అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం అందించే ఆసుపత్రుల్లో రెండవ స్థానంలో నిలిచిందన్నారు. చికిత్సకు ఖర్చు భరించలేని వారికి కూడా బాలకృష్ణ ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారన్నారు. ఎంతోమంది పేద క్యాన్సర్ రోగుల కుటుంబంలో బాలయ్య వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఏసుపాదం, సిరిపురపు తులసిరాణి, లింగం చిట్టిబాబు, నిమ్మగడ్డ సత్యసాయి, నూర్, మిక్కిలినేని రమేష్, దాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments