సకాలంలో సాగునీరు.



అమరావతి (ప్రజా అమరావతి);

- ఇరిగేషన్‌పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. 

- క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమగ్రంగా చర్చించిన ముఖ్యమంత్రి.


*సకాలంలో సాగునీరు*:


- ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్యాలెండర్‌ ప్రకారం రైతులకు సాగునీరు విడుదలచేస్తున్నామని తెలిపిన అధికారులు.

- ఇప్పటికే గోదావరి, కృష్ణాడెల్టా, తోటపల్లి కింద ప్రాంతాలకు సాగునీరు విడుదలచేశామని వెల్లడి.


*చక చకా పోలవరం*:

- పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమీపిస్తున్న కొద్దీ లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌పై కూడా దృష్టిపెట్టాలన్న సీఎం. 

- ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపిన అధికారులు.

- ఈసీఆర్ఎఫ్‌ డ్యాం గ్యాప్‌-1లో శాండ్‌ ఫిల్లింగ్‌, వైబ్రోకాంపాక్షన్‌ పనులు పూర్తయ్యాయని వెల్లడించిన అధికారులు.

- గ్యాప్‌-2 వద్ద కూడా ఇదే పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించిన అధికారులు.

- కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలమండలి అధికారులు గైడ్‌ బండ్‌లో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారని వెల్లడించిన అధికారులు.

- నేల స్వభావంలో మార్పలు కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అనుమానాన్ని కమిటీ వెల్లడించిందన్న అధికారులు.

- దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్‌ డంప్‌తో, సిమెంట్‌ స్లర్రీతో నింపాలని, గేబియన్స్‌తో సపోర్టు ఇవ్వాలని కమిటీ సూచించిందని తెలిపిన అధికారులు.

- ఆమేరకు పనులు ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపిన అధికారులు.

- పూర్తి విశ్లేషణ తర్వాత శాశ్వతంగా చేయాల్సిన మరమ్మతులను సూచిస్తామని కమిటీ చెప్పినట్టుగా వెల్లడించిన అధికారులు.

-  పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి కేంద్ర ఆర్థికశాఖ రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, కేంద్ర కేబినెట్లో పెట్టేందుకు కేబినెట్‌ నోట్‌ తయారీపై వివిధ మంత్రిత్వశాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తున్నాయని వెల్లడించిన అధికారులు.

- పోలవరం మొదటి దశ పరిధిలోకి వచ్చే 20,946 ముంపు బాధిత కుటుంబాల్లో 12,658 మందిని ఇప్పటికే తరలించామని, మిగిలిన 8,288 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్న అధికారులు. 


*ప్రాధాన్యత ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక శ్రద్ధ*:


- ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టుల పూర్తి ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు.

- ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షించుకోవలన్నారు. 

- ఈమేరకు కార్యాచరణ చేసుకుని వేగంగా వాటిని పూర్తిచేయాలన్నారు.

- వెలగొండ, వంశధార, అవుకు సహా పలు ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో పరిస్థితులను సీఎం సమీక్షించారు.

- ఈ ప్రాజెక్టుల ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. 


- అవుకు రెండో టన్నెల్‌ నిర్మాణం పూర్తి, చివరిదశలో లైనింగ్‌ కార్యక్రమం ఉందని, 

ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన అధికారులు.

- అవుకు ద్వారా 20వేల క్యూసెక్కుల సముద్రంలో కలిసే కృష్ణా వరదజలాలను రాయలసీమ దుర్భిక్షప్రాంతానికి తరలించేందుకు మార్గం సుగమమైందని, వరదలు సమయంలో సముద్రంలో కలవకుండా నీటిని కరవుపీడిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని తెలిపిన అధికారులు.


- వెలిగొండ ప్రాజెక్టు పనులపై పురోభివృద్ధిని సీఎంకి వివరించిన అధికారులు.

- ఇప్పటికే మొదటి టన్నెల్‌ పూర్తయ్యిందని, రెండోటన్నెల్‌ పనులుకూడా కొలిక్కివస్తున్నాయని తెలిపిన అధికారులు.

- పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు 92.14శాతం పూర్తయ్యాని, ఆగస్టు నాటికి హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు పూర్తిచేస్తామన్న అధికారులు.

- టన్నెల్‌ తవ్వకం పనులు 18,787 మీటర్లకుగానూ, 17,461 మీటర్లు పూర్తిచేశామన్న అధికారులు.

- నీటిని తరలించడానికి వీలైనంత తర్వగా మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం.

- వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా గొట్టిపాడు డ్యాం, కాకర్ల డ్యాం, తీగలేరు అప్రోచ్‌ ఛానల్, తీగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌, ఈస్ట్రన్‌ మెయిన్‌ కెనాల్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయన్న అధికారులు. 


- *వంశధార పనులపైనా సీఎం సమీక్ష.*

- ఈ ఏడాది వంశధార స్టేజ్‌-2, ఫేజ్‌-2 కింద డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను కూడా పూర్తిచేస్తు్న్నామన్న అధికారులు.

- గొట్టాబ్యారేజీ నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా హిరమండలం రిజర్వాయర్‌ను నింపే కార్యక్రమం వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చాలన్న సీఎం.


- తోటపల్లి బ్యారేజీ కింద మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగర్‌, మహేంద్ర తనయ రిజర్వాయర్లపై సీఎం సమీక్ష.

- ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయన్న అధికారులు. 

- వీటి తర్వాత ప్రాధాన్యతగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష.

- కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయన్న అధికారులు.


ఏపీ నాలుగు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్‌ అవార్డ్స్‌ 2022) దక్కించుకోవడంపై మంత్రి, అధికారులను అభినందించిన సీఎం.


నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు గాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో తృతీయ స్ధానంలో నిలిచిన ఏపీ, ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ నారాయణ రెడ్డి.

Comments