జగనన్న సురక్ష కింద మిగిలిన ఉన్న అర్హులను గుర్తించి పథకాలు అమలు.రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


* జగనన్న సురక్ష కింద మిగిలిన ఉన్న అర్హులను గుర్తించి పథకాలు అమలు* జూన్ 24 నుంచి జూన్ 30 వరకు ఇంటింటి సర్వే


* జూలై ఒకటి నుంచి జూలై 23 వరకు జగనన్న సురక్ష గ్రామ సభలు- హోం మంత్రి డా తానేటి వనిత 


- జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత 


మన ప్రభుత్వము అందచేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనం పొందని లబ్ధిదారులను గుర్తించి వాటిని అందచేసే జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం ద్వారా మరో అడుగు ముందుకు వెయ్యడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు.


జిల్లా వ్యాప్తంగా వాలంటీర్లు జూన్ 24 నుంచి 30 వరకు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి జగనన్న సురక్ష కింద డేటా ఎంట్రీ చేసి, అర్హత ఉన్న లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత తెలిపారు.ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, జగనన్న ఆధ్వర్యంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ తీసుకుని దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తలుపు తట్టి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని అన్నారు. కేవలం జగనన్న ప్రభుత్వంలోనే సాధ్యం అయిందని అన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేసి, మరింత జవాబుదారీతనం ఉండటం కోసం జగనన్నకు చెబుదాం కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే 99 శాతం మందికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా, మిగిలి ఉన్న ఒక శాతం వారి కోసం ఆలోచన చేస్తున్న జగనన్న కు ప్రజలు పెద్ద ఎత్తున అభినందనలు చేస్తున్నారని మంత్రి తెలిపారు.  రాష్ట్రంలో ఏ ఒక్క అర్హుడు ప్రభుత్వం అందచేస్తున్న డిబిటి (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) నాన్ డిబిటి కింద అందచేస్తున్న పథకాలు అందకుండా ఉండకూడదనే సంకల్పం తో " జగనన్న సురక్ష " ఈరోజు శ్రీకారం చుట్టారన్నారు. పారదర్శకంగా పౌర సేవలు అందించే క్రమంలో ప్రజల వద్దకే పరిపాలన తీసుకుని వెళ్ళిన ఘనత ముఖ్యమంత్రి జగనన్న కే చెల్లిందని హోం మంత్రి వనిత పేర్కొన్నారు. ఇప్పటికే ద్వై వార్షిక విధానంలో మిగిలి పోయిన అర్హులకు జూలై, డిసెంబర్ నెలల్లో గుర్తించి ప్రయోజనం కల్పిస్తున్నట్లు తెలిపారు.


దేశ చరిత్రలో పేదల పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం ఏ రాష్ట్రం లో లేదన్నారు. ప్రభుత్వ పధకాల ప్రయోనాలు అందుకోవడంలో  రాష్టంలో అర్హులైన ఏ ఒక్క పేదవాడు మిగలకూడదన్న లక్ష్యం తో ముఖ్యమంత్రి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు.


జగనన్న సురక్ష కింద జిల్లా వ్యాప్తంగా ఉన్న 3937 సచివాలయ కార్యదర్శులు, 8933 మంది వాలంటీర్లకు ఇప్పటికే మండల పరిధిలో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో  శిక్షణ తో కూడిన అవగాహన కలుగ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు.  ఇప్పటికే జగనన్న సురక్ష సందర్భంలో ఉచితంగా అందించే 11 రకాల సేవలకు సంబంధించి అవగాహన కల్పించడం , ఇంటింటి సర్వే సందర్భంలో డేటా ఎంట్రీ కి చెందిన ఫార్మెట్ లను అందజేసినట్లు తెలియ చేశారు. స్పందన, జగనన్న కు చెబుదాం కింద వొచ్చిన అర్జీలను సంఘటితం చేసి ఇంకా పరిష్కారం కానీ వాటిని జగనన్న సురక్ష కింద చేపట్టడం జరుగుతుందని ఆమె అన్నారు. జూలై 1 నుంచి జూలై 23 వరకు గ్రామ స్థాయి లో జగనన్న సురక్ష గ్రామ సభ సమావేశాలు ప్రత్యామ్నాయ రోజులలో నిర్వహించడం కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇంటింటి సర్వే ద్వారా వచ్చిన అర్జీలను గ్రామ సభల సందర్భంలో ధ్రువపత్రాలు అందచెయ్యడం జరుగుతుందని అన్నారు.ప్రతి మండలంలో రెండు టీం లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టీం తహసీల్దార్, ఈఓపిఆర్డీ తోనూ రెండవ టీం ఎంపిడీఒ, డిప్యూటీ తహసీల్దార్ మరో టీమ్ లను ఏర్పాటు చేసామన్నారు.  వీరు ప్రతి రోజు అయా మండలంలో రెండు సచివాలయాలను కవర్ చేస్తారని పేర్కొన్నారు.

జిల్లాలో జగనన్న కు చెబుదాం 1902 ద్వారా వచ్చిన 2500 సమస్యలను నిర్నీత సమయంలోనే పరిష్కరించామన్నారు.


ఈ కార్యక్రమంలో  డి సి సి బి చైర్మన్ ఆకుల వీర్రాజు, రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్,  జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పి. వీణా దేవి, వి. శాంత మణి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments