ప్రత్యేక దృష్టి తో రహదారుల నిర్మాణం.



*ప్రత్యేక దృష్టి తో రహదారుల నిర్మాణం


*


పార్వతీపురం / సాలూరు, జూన్  21 (ప్రజా అమరావతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో గిరి శిఖర గ్రామాలకు రహదారుల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. సాలూరు, పాచిపెంట మండలాల పరిధిలోని మారుమూల గిరిశిఖర ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులను పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు బుధవారం విస్తృతంగా పర్యటించారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన లో భాగంగా మండలంలోని సాలూరు మండలం జాతీయ రహదారి 26 నుండి కారాడ వలస వరకు అంచనా విలువ రూ.496 లక్షల వ్యయంతో సుమారు 6.8 కి.మీ , పాచిపెంట మండలం ఆజూరు గ్రామం నుండి చాకి రావివలస మీదుగా పందిరి మామిడి వలస వరకు అంచనా విలువ రూ.224 లక్షల వ్యయంతో సుమారు 3.8 కి.మీ , రొడ్డ వలస నుంచి కంకనా పల్లి మేరకు అర్ పి పి ఎల్ డబ్ల్యూ వి క్రింద నిర్మిస్తున్న తారు రోడ్డు పనులను పరిశీలించారు. రోడ్ నిర్మాణ పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారుల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారుల నిర్మాణాలకు అవసరమైన అటవీ అనుమతులు పొంది వున్నందున పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారుల నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణ పై ఆరా తీయగా ఇప్పటి వరకు రెండు దశలలో రాష్ట్ర స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కల్వర్టు నిర్మాణాలకు అనుకూల సమయం అయినందున పనులను ప్రణాళికా బద్ధంగా సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల  ప్రజల రాకపోకలకు, రవాణా సౌకర్యాలు కలిగే విధంగా వీలైనంత త్వరగా పూర్తి స్థాయిలో రహదారులను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. పనులు పరిశీలన అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో తసీల్దార్ అర్.బాల మురళి,  పంచాయితీ రాజ్ శాఖ డీ ఈ డబ్ల్యూ. వి.శర్మ, ఏఈ లు బి.శంకర్ రావు, వి.వర లక్ష్మి, ఉప తశీల్దార్ భాను ప్రకాష్, తదితరులు, పాల్గొన్నారు.

Comments