మనసున్న మా రాజు.




*మనసున్న మా రాజు*





పార్వతీపురం, జూన్ 28 (ప్రజా అమరావతి) : మనసున్న మా రాజు అని ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నిరూపించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పర్యటనకు బుధ వారం విచ్చేసిన ముఖ్య మంత్రి కి అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు బాధితులు, ఉపాధి కావాలని పలువురు యువత విన్నవించగా తక్షణం స్పందించి వారికి ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ముఖ్య మంత్రి స్పందనతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. 


వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం గోపాలపురం గ్రామం నుండి సంపంగి దేవాన్ష్ (తల్లిదండ్రులు లక్ష్మీ సాయిరాం)  ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేస్తూ అప్పలేసియా వ్యాధితో బాధపడుతున్నామని,  ఈ వ్యాధి ఆరోగ్య శ్రీ క్రిందకు రావడంలేదని కేజీహెచ్ లో కొంతమేర చికిత్స పొందామని అనంతరం విజయనగరం వెంకట పద్మా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని పింఛను మంజూరు చేయాలని కోరారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ లక్ష రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేసి వెంటనే  చెక్కును అందజేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు చెక్కును అందజేశారు.


 శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం జాడ గ్రామం నుండి వై గణేష్ (శంకర్రావు) రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి మిజిల్స్ వైరస్ తో బాధపడుతున్నామని ఆరోగ్య శ్రీ క్రింద చికిత్స పొందడం జరిగిందని, తదుపరి చికిత్సను పొందుటకు తగు సహాయం చేయాలని కోరారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ లక్ష రూపాయల నిధిని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేస్తూ వెంటనే అందించాలని ఆదేశించారు.


 విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఉత్తరవల్లి గ్రామం నుండి బేత గగన దీపక్ (గణేష్) ఫిట్స్ తో బాధపడడం జరుగుతుందని తగిన ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరగా ముఖ్యమంత్రి స్పందిస్తూ వెంటనే లక్ష రూపాయలను మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదల చేశారు. అధికారులకు తక్షణం అందించాలని ఆదేశించారు.


 పార్వతీపురం మండలం పార్వతిపురం పట్టణానికి చెందిన బేత హాసిని (శ్రీనివాసరావు) బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నామని, చికిత్స పొందామని బెంగుళూరు పినాకిల్ ఆసుపత్రిలో చికిత్సకు 3 లక్షల రూపాయలు ఖర్చు చేశామని, ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కోరగా ముఖ్యమంత్రి స్పందిస్తూ 3 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదల చేశారు. అధికారులు వెంటనే నిధులను చెక్కు అందజేశారు.


విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామం నుండి నారాయణరావు ముఖ్యమంత్రి కి ఆర్జేని సమర్పిస్తూ న్యూకోపోలీతో బాధపడుతున్నామని ఆరోగ్యశ్రీ కింద ఈ వ్యాధి లేదని, బోన్ మారో చికిత్సకు ఆర్థిక సహాయం చేయాలని కోరగా ముఖ్యమంత్రి లక్ష రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందజేశారు. అధికారులు వెంటనే చెక్కును పంపిణీ చేశారు.


పార్వతీపురం మన్యం జిల్లా బలిజి పేట మండలం మరువాడ గ్రామం నుండి పిల్లి లక్ష్మణరావు క్రింద దవడ ట్యూమర్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలియజేయగా ముఖ్యమంత్రి స్పందిస్తూ లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేశారు దీన్ని అధికారులు వెంటనే పంపిణీ చేశారు.


పార్వతిపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చినబోగిలి గ్రామం నుండి చోరీ లోకేష్ (రమణ) ముఖ్యమంత్రి కి గాచర్ వ్యాధి నుండి బాధపడుతున్నామని ఇప్పటికే రూ.1. 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2023 జనవరిలో మంజూరు చేయడం జరిగిందని, పింఛను మరియు ఆర్థిక సహాయం ఇప్పించి ఎంజయిమ్ ను రీప్లేస్మెంట్ తెరాపి కొరకు సహాయ పడాలని కోరగా ముఖ్యమంత్రి లక్ష రూపాయలను మంజూరు చేసి చెక్కులను వెంటనే అందజేయాలని అధికారులు ఆదేశించారు.


 పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన మక్కువ జస్విత (శ్రీలక్ష్మి) కంజనీటల్ డిఫార్మటీ తో బాధపడుతున్నామని ఉత్తరప్రదేశ్ లో త్రిశల ఫౌండేషన్ లో చికిత్స పొందుటకు తగిన సహాయం చేయాలని కోరగా ముఖ్యమంత్రి లక్ష రూపాయలను మంజూరు చేసి వెంటనే అందించాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు వెంటనే జిల్లా కలెక్టర్ అందజేశారు.


 పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం లక్నాపురం గ్రామానికి చెందిన ముదిలి గిరి వర్ధన్ (శ్రీధర్) ముఖ్యమంత్రి కి విన్నవిస్తూ హార్ట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేయగా వెంటనే స్పందించి లక్ష రూపాయల నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేశారు. అధికారులు వెంటనే చెక్కు రూపంలో అందించారు.


 పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట గ్రామం నుండి అలజంగి వెంకటేశ్వరరావు (లక్ష్మి) 90% వ అంగవైకల్యం కలిగే ఉన్నామని ఉపాధి కల్పించాలని కోరగా ముఖ్యమంత్రి స్పందిస్తూ స్వయం ఉపాధికి కొరకు లక్ష రూపాయల నిధులను మంజూరు చేశారు.


 శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సూరంపేట గ్రామానికి చెందిన నజాన సురేష్ (సీతప్పడు) యాక్సిడెంట్ జరగడం, పోలియో కలిగి ఉండడం వలన ఉపాధి కల్పించాలని కోరగా స్వయం ఉపాధి కొరకు లక్ష రూపాయల నిధులను మంజూరు చేశారు.


విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోరాడ వీధికి చెందిన పిజిఎన్ శ్రీనివాస్ క్యాన్సర్ తో బాధపడుతున్నామని, ఇంటర్మీడియట్  చదవడం జరిగిందని ఉపాధి కల్పించాలని కోరగా స్వయం ఉపాధి కొరకు లక్ష రూపాయలు నిధులను మంజూరు చేశారు.


 విజయనగరం జిల్లా బొబ్బిలి పట్నం కోరాడ వీధికి చెందిన పి.బి శ్రీరామ్ క్యాన్సర్ తో బాధపడడం జరుగుతుందని తెలియజేయగా లక్ష రూపాయల నిధులను మంజూరు చేసారు. 


విజయనగరం జిల్లా రాజాం గ్రామానికి చెందిన పోసిన భవాని భూ తగాదాలు ఉన్నాయని, కొంతమంది వాటిని అడ్డుకుంటున్నారని తన కుమార్తె బీఫార్మసీ చదువుతుందని తెలియజేయగా ముఖ్యమంత్రి స్పందిస్తూ లక్ష రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేస్తూ తగాదాల నివారణకు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ తో మాట్లాడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు అవసరం మేరకు అవకాశం మేరకు ఫార్మసీ కంపెనీలో ఉద్యోగ నియామకానికి సాహాయ పడతామని తెలిపారు.

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image