వారాహి యాత్ర " ను విజయవంతం చేయండి - చిల్లపల్లి శ్రీనివాసరావు.

 *" వారాహి యాత్ర " ను విజయవంతం చేయండి - చిల్లపల్లి శ్రీనివాసరావు


*మంగళగిరి (ప్రజా అమరావతి);


జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ *చిల్లపల్లి శ్రీనివాసరావు* అధ్యక్షతన ఈరోజు ఉదయం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో  "వారాహి యాత్ర"కు సంబంధించిన పోస్టర్ ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ

 జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాలో జూన్ 14వ తేదీన మొదలవుతుంది. ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఈ రోజున మా పార్టీ నాయకులతో కలిసి మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగిందని అన్నారు.


 ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్  మొదలు పెడుతున్న ఈ వారాహి యాత్ర దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో వారాహ యాత్ర కొనసాగుతుందని అన్నారు.

 అలాగే ఉభయగోదావరి జిల్లాలో ఉన్నటువంటి బడుగు, బలహీన వర్గాలని, చేనేత కార్మికులను, మత్స్యకారుల్ని, ప్రజల్ని అందరిని కలిసి వారి సమస్యలు తెలుసుకొని, రేపటి రోజున జనసేన పార్టీ అధికారంలోకి రాగానే భావితరాల భవిష్యత్తు కోసం ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రణాళిక రూపొందించడానికి ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా వారాహి యాత్ర పవన్ కళ్యాణ్  చేయనున్నారు అని అన్నారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు అందరూ భారీగా ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, MTMC అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు, MTMC మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుభాని, సీనియర్ నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, MTMC ఉపాధ్యక్షులు శెట్టి రామకృష్ణ, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు తంబి, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు బత్తినేని అంజయ్య, MTMC ప్రధాన కార్యదర్శులు బాణాల నాగేశ్వరావు, బళ్ళ ఉమామహేశ్వరావు, కార్యదర్శులు దాసరి వెంకటేశ్వరరావు, కామేష్, బేతపూడి వంశీ, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు సుందరయ్య, పెనుమాక గ్రామ అధ్యక్షులు గిరిబాబు, చిల్లపల్లి యూత్ సభ్యులు బేతపూడి దీపక్, నాగరాజు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Comments