ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.

 *- ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు


 *- తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము* గుడివాడ, జూన్ 28 (ప్రజా అమరావతి): ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ నాయకులు వెనిగండ్ల రాము బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడలో వెనిగండ్ల మీడియాతో మాట్లాడారు. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని అన్నారు. హజ్ యాత్ర చివరిలో ఈ బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారని తెలిపారు. అల్లాహ్ ఆదేశంతో ప్రవక్త ఇబ్రహీం తన ఏకైక కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడగా, ప్రవక్త త్యాగానికి సంతోషించి, ఇబ్రహీం కుమారుడికి బదులు గొర్రెను ఉంచుతాడన్నారు. నాటి నుండి బక్రీద్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు గొర్రెను బలి ఇచ్చి దాని మాంసాన్ని బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, పేదలకు పంచి మూడవ భాగాన్ని కుటుంబం కోసం కేటాయిస్తారన్నారు. ఈ బక్రీద్ పండుగ ముస్లిం సోదరులకు ఆనందాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికీ అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. అల్లాహ్ పట్ల భక్తి విధేయతలు కొనసాగాలని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేలా అల్లాహ్ ఆశీస్సులివ్వాలని వెనిగండ్ల ప్రార్థించారు.

Comments