గృహ నిర్మాణం లో కేవలం గణాంకాలే కాకుండా ఆచరణలో అనుకున్న లక్ష్యం మేరకు క్షేత్ర స్థాయిలో పనులు జరగాలి.

 

నెల్లూరు జూన్ 19 (ప్రజా అమరావతి);


గృహ నిర్మాణం లో కేవలం గణాంకాలే కాకుండా ఆచరణలో అనుకున్న లక్ష్యం మేరకు క్షేత్ర స్థాయిలో పనులు జరగాల


ని జిల్లా కలెక్టర్ యం హరి నారాయణన్ పేర్కొన్నారు.


సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి యం పి డి ఓ లు, హోసింగ్ ఎ ఇ లు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల తో జాయింట్ కలెక్టర్ కుర్మనాధ్ తో కలసి జిల్లా కలెక్టర్ వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయుటకు సంబంధిత అధికారులందరూ అలసత్వం వీడి కృషి చేయాలన్నారు. ప్రతి వారం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఆదిగమించడానికి సచివాలయాల వారీగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ల స్థాయిలో సమీక్ష నిర్వహించుకుని పనుల పురోగతి సాధించాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనే మెగా లేఔట్లలో ఒకటైన కావలి లేఅవుట్ పై ముఖ్యమంత్రి స్థాయిలో ప్రత్యేకంగా సమీక్షిస్తున్న దృష్ట్యా సంబంధిత  లేఅవుట్ ను పూర్తి చేయుటకు అధికారులు సమిష్టి గా కృషి చేయాలన్నారు. అదేవిధంగా స్టేజ్ కన్వర్షన్, రుణాల మంజూరు, సిమెంట్, ఇసుక లభ్యత ఉండేలా చూడటం, సొంతంగా ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులతో మాట్లాడుతూ త్వరితగతిన పూర్తయ్యేందుకు సూచనలు చేయడం వంటి విషయాలపై

ఎ ఇ లు శ్రద్ద వహించాలన్నారు.


జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాద్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలలో ప్రతివారం 25 శాతానికి తప్పకుండా పురోగతి ఉండాలన్నారు. అందుకు తగ్గట్టుగా ముందస్తు ప్రణాళిక రచించుకొని తదనగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.


ఈ సమావేశంలో డి ఆర్ డి ఏ పిడి సాంబశివరెడ్డి, మెప్మా పిడి రవీంద్ర, డ్వామ పిడి వెంకట్రావు, గృహ నిర్మాణ ఇంచార్జి పిడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు
Comments