ఎఫ్ఎల్ఎన్ అమలులో ఆంధ్రప్రదేశ్ భేష్.

 

విజయవాడ (ప్రజా అమరావతి);


*ఎఫ్ఎల్ఎన్ అమలులో ఆంధ్రప్రదేశ్ భేష్*


ప్రశంసించిన కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్య & అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్


ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ)  ద్వారా ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్యను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంభిస్తున్న పని తీరు బాగుందని కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్య & అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ ప్రశంసించారు. శనివారం  పుణేలో సావిత్రిభాయి ఫూలే విశ్వవిద్యాలయంలో జరుగుతున్న జి-20 ‘జన్ భాగీదారీ’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించారు.  సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి.శ్రీనివాసరావు గారు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను  బాగుందని కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్య & అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ గారికి వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘నిపుణుభారత్’ కార్యక్రమం తరఫున పూర్వ ప్రాథమిక మరియు ప్రాథమిక పాఠశాలల విద్యార్థిని విద్యార్థులలో పునాది అభ్యసనా మరియు గణిత నైపుణ్యాల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా జాతీయస్థాయిలో పూణేలో జరుగుతున్న ‘జన్ భాగీదారీ’ ప్రదర్శనలో నమూనా ఫౌండేషనల్  పాఠశాలని స్టాల్ రూపంలో ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశేష  ఆదరణ లభించింది. వివిధ రాష్ట్రాల పథక సంచాలకులు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. 

అనంతరం ఉత్తరఖండ్ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ టి రవికుమార్ స్టాల్‌ను సందర్శించి,  విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు పెంపొందించడానికి రూపొందించిన పిక్టోరియల్ డిక్షనరీ పరిశీలించి అభినందించారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ ద్వారా డిజిటల్ విద్యా బోధన గురించి ఆంధ్రప్రదేశ్ బృందాన్ని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని తమ సిబ్బందికి ఆదేశించారు.  రాజస్థాన్ ప్రిన్సిపల్ సెక్రటరీ  శ్రీ నవీన్ జైన్ ఫౌండేషనల్ స్కూళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఏపీ స్టాళ్లను సందర్శించి సెల్ఫీలు తీసుకున్నారు. ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెళ్ల ద్వారా డిజిటల్ విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో స్టేట్ అకడమిక్ మోనటరింగ్ డైరెక్టర్ బి.విజయభాస్కర్ గారు, శామో (స్టేట్ అకడమిక్ మోనటరింగ్), పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా పీఎంయూ బృందం, ఎస్సీఈఆర్టీ, శామో, స్యీమాట్,  సిబ్బంది పాల్గొన్నారు.


Comments